రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెగా డాటా నిహారిక కొనిదెలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో పలు సినిమాలలో హీరోయిన్గా నటించింది నిహారిక( Niharika Konidela ).
అంతకుముందు యాంకర్ గా రాణించింది.కానీ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువకాలం నిలదొక్కుకోలేకపోయింది నిహారిక.
ముఖ్యంగా ఆమె హీరోయిన్ గా అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయింది.పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.
ప్రస్తుతం నిహారిక నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లను, సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగానే నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు( Committee Kurrollu ) అనే సినిమా రేపు అనగా ఆగస్టు 9న విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ప్రస్తుతం బిజీగా ఉంది నిహారిక.ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.కళ్యాణ్ బాబాయ్ బాలు సినిమాలోని నీలో జరిగే తంతు చుస్తూనే ఉన్నా.
సాంగ్ నాకు బాగా నచ్చింది.ఆ పాట చూసి నేను కూడా నటి అవ్వాలని అనుకున్నాను.
ఆ పాట నన్ను ఇన్‌స్పైర్ చేసింది అని తెలిపింది నిహారిక.
దీంతో నిహారిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ పాటలో ఇన్‌స్పైర్ చేసేంత ఏముంది, నిహారిక నటి అవ్వాలనుకునేంతగా ఆ పాటలో ఏముందో, నిహారిక అందులో ఏం గమనించిందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.ఒకవైపు సినిమాలను నిర్మిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.మరి రేపు విడుదల కాబోతున్న కమిటీ కుర్రాళ్లు సినిమా ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి మరి.