టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో హరీష్ శంకర్( Harish Shankar ) ఒకరు కాగా త్వరలో మిస్టర్ బచ్చన్( Mr Bachchan Movie ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ సినిమా బాలీవుడ్ రైడ్ మూవీకి( Raid Movie ) రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ సినిమా స్క్రిప్ట్ లో కీలక మార్పులు చేశారు.
ఈ సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) సినిమాతో హరీష్ శంకర్ బిజీ కానున్నారు.త్వరలో హరీష్ శంకర్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు రానున్నాయి.
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తెరి మూవీ రీమేక్( Theri Movie Remake ) అనే సంగతి తెలిసిందే.ఈ సినిమా గురించి, మిస్టర్ బచ్చన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మిస్టర్ బచ్చన్ మూవీ రీమేక్ అయినప్పటికీ ఒరిజినల్ కథకు దీనికి పోలికలు ఉండవని హరీష్ శంకర్ పేర్కొన్నారు.లవ్ స్టోరీ ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కిందని 70 శాతం మార్పులు చేశామని హరీష్ శంకర్ వెల్లడించారు.
మిస్టర్ బచ్చన్ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ కొత్త ప్రపంచంలోకి వెళ్తారని హరీష్ శంకర్ అన్నారు.ఈ సినిమాలో హీరో చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడని పాటలు కలర్ ఫుల్ గా ఉంటాయని డైలాగ్స్ ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా ఉంటాయని హరీష్ శంకర్ పేర్కొన్నారు.తెరి రీమేక్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ ఆపేయాలని 2 లక్షల 68 వేల నెగిటివ్ ట్వీట్లు వచ్చాయని హరీష్ శంకర్ పేర్కొన్నారు.
ఒక విధంగా ఇది రికార్డ్ అని హరీష్ శంకర్ తెలిపారు.ఏ డైరెక్టర్ పై ఈ స్థాయిలో ట్రోలింగ్ జరగలేదని ఆయన అన్నారు.ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ విడుదలైన తర్వాత ట్రోల్స్ చేసిన వాళ్లంతా సారీ చెప్పారని హరీష్ శంకర్ వెల్లడించారు.
హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.