ఒకే ఒక్క సినిమాతో ఆస్తినంతా కోల్పోయిన సెలబ్రిటీలు.. ఎవరంటే..?

సాధారణంగా సినిమాల్లో నటించడం అంత సులభమైన పనేం కాదు.చాలామంది నటులు బాగా కష్టపడి ఎంతో కొంత డబ్బులు వెనకేస్తుంటారు.

 Celebs Who Lost Everything With One Movie Giri Babu Dhanraj Nagababu Details, Na-TeluguStop.com

కొందరు వాటిని రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పెట్టుబడి పెడతారు.మరికొందరు బ్యాంక్‌లోనో, ఏదో ఒక విధంగా దాచుకుంటారు.

కొందరు మాత్రం పెళ్లిళ్ల వల్ల డబ్బులు నష్టపోతుంటారు.అయితే సినిమాల పట్ల బాగా ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రం ప్రొడ్యూసర్లుగా( Producers ) మారతారు.

తమకు నచ్చిన సినిమాలను ప్రొడ్యూస్ చేసి ప్రేక్షకులకు అందించాలనుకుంటారు.

అయితే ఇది చాలా రిస్క్ తో కూడుకున్న పని.తేడా వస్తే వాళ్లు సంపాదించిన ఆస్తి అంతా కూడా ఒక్క మూవీతో తుడిచిపెట్టుకుపోతుంది.ఉదాహరణకు నాగబాబు( Nagababu ) ఆరెంజ్ సినిమా( Orange Movie ) వల్ల ఎంత నష్టపోయారో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.

నాగబాబుతో పాటు మరో ఇద్దరు సెలబ్రిటీలు కూడా ఒకే ఒక్క సినిమాతో ఆస్తినంతా కోల్పోయారు.వాళ్ళు ఎవరో తెలుసుకుందాం.

• గిరి బాబు

Telugu Actors, Bosebabu, Dhanraj, Flop, Giri Babu, Indrajit, Nagababu, Orange, T

గిరి బాబు( Giribabu ) టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతినాయకుడు, హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు.కొన్ని సినిమాలను డైరెక్ట్ కూడా చేశాడు.నాలుగు సినిమాలు దాకా ప్రొడ్యూస్ కూడా చేశాడు.అయితే ఆయన 1990 కాలంలో 50 లక్షలతో నిర్మించిన “ఇంద్రజిత్”( Indrajit Movie ) అనే సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్ అయింది.

దీనికి డైరెక్టర్ కూడా గిరి బాబే.అతని రెండవ కుమారుడు బోస్ బాబు హీరోగా ఈ మూవీ వచ్చింది.

ఈ మూవీ స్టోరీ బాగానే ఉంటుంది కానీ దీనికి సరిగా ప్రమోషన్లు జరగలేదు.అందువల్ల బాక్సాఫీస్ వద్ద అది కలెక్షన్లు రాబట్టలేకపోయింది.దాదాపు 35 ఏళ్ల క్రితం రూ.50 లక్షలు అంటే ఇప్పుడు ఎన్ని కోట్లతో సమానమో అర్థం చేసుకోవచ్చు.గిరిబాబు ఈ మూవీ కారణంగా తలెత్తిన నష్టాల నుంచి బయటపడేందుకు తన ఆస్తినంతా అమ్ముకున్నాడు.మూవీ ఎదురు తన్నడంతో ఆయన అప్పటిదాకా సంపాదించిన మనీ మొత్తం పోయింది.

• జబర్దస్త్ కమెడియన్ ధన్‌రాజ్

Telugu Actors, Bosebabu, Dhanraj, Flop, Giri Babu, Indrajit, Nagababu, Orange, T

జబర్దస్త్ లో చిన్న వేషాలు వేస్తూ అలరించిన ధన్‌రాజ్( Dhanraj ) తర్వాత సినిమాల్లో మంచి పాత్రలు పోసిస్తూ చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఎన్నో ఏళ్లుగా కష్టపడి బాగానే డబ్బులు వెనకేశాడు.ఆ డబ్బులు అన్నీ కూడా “ధనలక్ష్మి తలుపు తడితే”( Dhanalakshmi Thalupu Thadithe ) అనే సినిమా కోసం ఖర్చు చేశాడు.ఈ మూవీ విడుదలైన వారం రోజులకే బాహుబలి సినిమా కూడా రిలీజ్ అయింది.

దానివల్ల ఈ చిన్న సినిమాని థియేటర్ల నుంచి తీసేశారు.దీని ఫలితంగా ఆ మూవీకి పెట్టిన పెట్టుబడి అనేది తిరిగి రాలేదు.

ఫలితంగా ధన్‌రాజ్ చాలా నష్టపోయాడు.దర్శకుడు సాయి అచ్యుత్ చిన్నారి ఈ మూవీని రూపొందించాడు.ఇందులో ధన్‌రాజ్, మనోజ్ నందం, రణధీర్, శ్రీముఖి, సింధు తులానీ తదితరులు నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube