తెలుగులో భారీ సక్సెస్ లను సాధించిన దర్శకులు చాలామంది ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఇక్కడ మంచి క్రేజ్ అయితే దక్కుతుంది.ఇక అలాంటి వాళ్ళలో రాజమౌళి( Rajamouli ) లాంటి వాళ్లు మొదటి స్థానంలో ఉంటారు.
ప్రస్తుతం రాజమౌళి పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలైతే ఉన్నాయి.
మరి దానికి తగ్గట్టుగానే జక్కన్న ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడనే వార్తలైతే అయితే వ్యక్తమవుతున్నాయి… ఇక ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేసి సంవత్సరం దాటుతున్నప్పటికీ ఇంకా ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయడం లేదు.
మరి ఎందుకు జక్కన్న ఈ సినిమా విషయంలో అంత లేట్ చేస్తున్నాడు అంటూ మహేష్ బాబు( Mahesh Babu ) అభిమానులైతే తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు…ఇక ఇదిలా ఉంటే రాజమౌళి గురించి ప్రస్తుతం సోషల్ మీడియా లో ఒక చర్చ నడుస్తుంది.భారీ ఓటిటి సంస్థ రాజమౌళి మీద ‘మోడ్రన్ మాస్టర్స్ ‘( Modern Masters ) అనే ఒక డాక్యుమెంటరీ ని తెరకెక్కించారు.అయితే ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి సినిమా విషయంలో ఎలాంటి పద్ధతులను అనుసరిస్తాడు.
ఆయన ఎలా ఒక సినిమాని హ్యాండిల్ చేయగలుగుతాడు అనే తెర వెనుక జరిగే విషయాలను కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు.
ఇక ఈ విషయం మీద కొంతమంది రాజమౌళికి సపోర్టుగా మాట్లాడుతున్నారు.ఇంక మరి కొంతమంది మాత్రం రాజమౌళితో సినిమా చేస్తే హీరో దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఆయన సినిమాకే స్టిక్ అయిపోవాల్సి ఉంటుంది.ఇక ఆ హీరో వేరే సినిమా చేయలేడు.
అతని అభిమానులు కూడా ఆయన కోసం భారీగా ఎదురు చూడాల్సిన అవసరమైతే ఉంది అంటూ కొన్ని నెగటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు.ఇక ఏది ఏమైనప్పటికీ ఆయా హీరోలకు రాజమౌళి మాత్రం లైఫ్ లో మర్చిపోలేని ఒక భారీ సక్సెస్ ని ఇస్తాడు అనేది మాత్రం చాలామంది హీరోల్లో విషయ లో ప్రూవ్ అయింది…