దివంగత నటుడు నందమూరి తారకరత్న( Nandamuri Tarakaratna) సతీమణి అలేఖ్య రెడ్డి( Alekhya Reddy ) ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపిస్తున్నారు.తారకరత్న మరణం తర్వాత అలేఖ్య తరచు తన భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎంతో ఎమోషనల్ అవుతూ ఉండేవారు.
ఈ విధంగా తరచూ తన భర్త తన పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే ఈమె తాజాగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.ఈమె నందమూరి ఇంటికి కోడలుగా వెళ్ళినప్పటికీ ఇటు విజయ సాయి రెడ్డికి వైయస్ కుటుంబానికి బంధువులు అనే సంగతి మనకు తెలిసిందే.
విజయసాయి రెడ్డికి అలేఖ్య రెడ్డి కూతురు వరుస అవుతుంది అయితే తారకరత్న మరణంతో విజయసాయిరెడ్డి తరచూ ఆలేఖ్య ఇంటికి వెళుతూ ఆమె బాగోగులు చూసుకుంటూ ఉన్నారు.తాజాగా వైయస్ షర్మిల( YS Sharmila ) తన కుమార్తెతో కలిసి అలేఖ్య రెడ్డి ఇంటికి వెళ్లారు.అయితే షర్మిల తన సమక్షంలోనే అలేఖ్య రెడ్డి పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేయడమే కాకుండా కేక్ కట్ చేస్తే తనకు కేక్ తినిపించారు.ఈ క్రమంలోనే ఈ వీడియోని అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
షర్మిలను అక్క అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ.అక్క ఎలాంటి సమయంలోనైనా నాకు తోడుగా ఉంటానని నువ్వు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకుంటున్నావు.నీ విలువైన సమయాన్ని నాకు కేటాయించి నాకు పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసినందుకు థాంక్యూ సో మచ్.నా కన్నీళ్లను ఆపుకోలేకపోతున్నాను.నువ్వు చేసే చిన్న చిన్న పనులైన నాకు ఆశీర్వాదాలే.లవ్ యు సో మచ్ అక్క అండ్ ఈమె షేర్ చేసిన ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .ఇందులో షర్మిల తన కూతురితో కలిసి ఈమె పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేశారు.ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా అలేఖ్య రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.