నటుడు నాగచైతన్య ( Nagachaitanya ) నటి శోభిత ( Sobitha ) ఎంతో ఘనంగా నిశ్చితార్థం ( Engagment ) జరుపుకున్నార. ఇలా సమంతకు విడాకులు(Divorce ) ఇచ్చిన నాగచైతన్య శోభితతో నిశ్చితార్థం జరుపుకోవడంతో మరోసారి చైతన్య సమంత ( Samantha ) విడాకుల విషయం గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇలా సమంత కంటే ముందుగా నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో విడాకులు విషయంలో సమంత తప్పులేదని తప్పు ఎవరి వైపు ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది అంటూ నేటిజన్స్ సైతం పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
ఇక సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ఈమెకు ప్రీతమ్( Preertham ) తో రిలేషన్ ఉందని అందుకే విడాకులు తీసుకున్నారు అంటూ అప్పట్లో వార్తలు సంచలనంగా మారాయి కానీ ఈ వార్తలను ప్రీతమ్ ఖండించారు.సమంత నాకు అక్కతో సమానం నేను తనని అక్క అనే పిలుస్తాను నాకు తనకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటో నాగచైతన్యకు తెలుసు.అనవసరంగా ఈ విషయంలోకి లాగొద్దు అంటూ ఈయన అప్పట్లో క్లారిటీ ఇచ్చారు.
అయితే తాజాగా నాగచైతన్య శోభిత నిశ్చితార్థం జరుపుకోవడంతో ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా ప్రీతమ్ స్పందిస్తూ.శుభాకాంక్షలు పతిత, ఇప్పుడు అతడు నీ వాడు.రహస్యాలు, అబద్ధాలు బంధాలను నాశనం చేస్తాయి.
మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా దొరికిపోతారు, అని రాసుకొచ్చాడు.ఈయన చేసిన ఈ పోస్ట్ చూస్తుంటే తప్పకుండా నాగచైతన్య శోభితను ఉద్దేశించే చేశారని అర్థమవుతుంది.
అంతే కాకుండా నాగచైతన్య సమంతల బంధం బీటలు బారడానికి వారు విడాకులు తీసుకొని విడిపోవడానికి శోభిత కారణమని ఈయన ఈ సందర్భంగా చెప్పకనే చెప్పారని తెలుస్తోంది.ఏది ఏమైనా సమంతకు విడాకులు ఇచ్చి శోభితను నాగచైతన్య పెళ్లి చేసుకోవడం పట్ల నేటిజన్స్ నుంచి విభిన్న రకాల కామెంట్స్ వ్యక్తం అవుతున్నాయి.