మరో ఆరు రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్న మిస్టర్ బచ్చన్ మూవీపై( mister bachchan movie ) భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.తాజాగా మిస్టర్ బచ్చన్ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.2 గంటల 38 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమాకు సెన్సార్ సభ్యుల నుంచి యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది.
రవితేజకు ( Ravi Teja ) జోడీగా ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే( Bhagyashree Borse )నటిస్తున్నారు.
భాగ్యశ్రీ బోర్సే లుక్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.ఈ సినిమాలో రవితేజ ఆదాయపు పన్ను శాఖ అధికారిగా, ఆర్కెస్ట్రా సింగర్ గా కనిపించనున్నారు.
ఈ సినిమాతో రవితేజ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రవితేజ, భాగ్యశ్రీ కాంబో సీన్స్ క్లాస్ గా ఉంటే రవితేజ జగపతిబాబు ( Jagapathi Babu )కాంబో సీన్స్ ఊరమాస్ గా ఉన్నాయని తెలుస్తోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్( People Media Factory Banner ) పై ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాకు బిజినెస్ బాగానే జరిగిందని తెలుస్తోంది.ఓటీటీ స్లాట్ వల్ల మిస్టర్ బచ్చన్ సినిమా ఈ నెల 15వ తేదీనే థియేటర్లలో విడుదలవుతోంది.సెన్సార్ టాక్ అద్భుతంగా ఉండటంతో మిస్టర్ బచ్చన్ పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.మిస్టర్ బచ్చన్ సినిమా భారీ స్థాయిలో స్క్రీన్లలో విడుదలవుతోంది.
మిస్టర్ బచ్చన్ సినిమా బాలీవుడ్ రైడ్ మూవీకి రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేశారని తెలుస్తోంది.మిస్టర్ బచ్చన్ మూవీ పాన్ ఇండియా మూవీగా థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం.మిస్టర్ బచ్చన్ రవితేజ కోరుకున్న భారీ హిట్ ను అందుకుంటారేమో చూడాల్సి ఉంది.