నడిరోడ్డుపై ఫోటోగ్రాఫర్ కు చెప్పులు అందించిన అక్షయ్ కుమార్.. ఈ స్టార్ హీరో రియల్లీ గ్రేట్!

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్( Akshay Kumar ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినీమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు అక్షయ్ కుమార్.

 Akshay Kumar Gives Sandals To The Photographer On The Sidewalk Watch Video, Aksh-TeluguStop.com

ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో అక్షయ్ కుమార్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా దాదాపుగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి.భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోతున్నాయి.

ఇటీవల విడుదలైన సర్ఫిరా సినిమా( Sarfira Movie ) కూడా బాగా నిరాశపరిచింది.

అంతకు ముందు విడుదలైన బడే మియా చోటే మియా, ది రాణిగంజ్ సినిమాలు కూడా అక్షయ్ కు నిరాశనే మిగిల్చాయి.దీంతో అక్షయ్ ఆశలన్నీ ఇప్పుడు ఖేల్‌ ఖేల్‌ మే సినిమాపై నే ఉన్నాయి.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15 న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

కాగా ఇందులో వాణి కపూర్‌, తాప్సీ, అమ్మీ విర్క్‌, ఫర్దీన్‌ ఖాన్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.ఆ సంగతి పక్కన పెడితే తాజాగా అక్షయ్ కుమార్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదేమిటంటే.మాములుగా సెలబ్రిటీలు కనిపిస్తే చాలు.

ఫొటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు వెంట పడతారు.

ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్ వెళుతుండగా.ఒక వీడియో గ్రాఫర్ తన కెమెరాలో విజువల్స్ ను బంధించాడు.అయితే ఇదే సమయంలో అతని చెప్పు ఊడిపోయింది.

దీనిని గమనించిన అక్షయ్ స్టార్ హీరో అన్న స్థాయిని పక్కన పెట్టి తన చేతితో చెప్పును తీసి సదరు వీడియో గ్రాఫర్ కు అందించాడు.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

దీనిని చూసిన వారందరూ అక్షయ్ సింప్లిసిటీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube