ఒక్క దెబ్బతో చుండ్రు పోవాలా.. అయితే ఈ టోనర్ మీకోస‌మే!

ప్రస్తుత వర్షాకాలంలో చుండ్రు ( Dandruff )అనేది అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఒకటి.ఆడవారే కాదు మగవారు కూడా చుండ్రు సమస్య వల్ల తీవ్ర ఇబ్బందికి గురవుతుంటారు.

 Super Effective Toner To Get Rid Of Dandruff Quickly , Dandruff, Dandruff Remo-TeluguStop.com

చుండ్రును పోగొట్టుకునేందుకు ఖరీదైన షాంపూలను వాడుతుంటారు.అయినా సరే కొందరిలో చుండ్రు ఓ పట్టాన పోదు.

అలాంటివారికి ఇప్పుడు చెప్పబోయే హెయిర్ టోనర్ చాలా బాగా సహాయపడుతుంది.ఈ టోనర్ ను వాడటం వల్ల ఒక్క దెబ్బతో చాలా వరకు చుండ్రును పోగొట్టుకోవచ్చు‌.

మరి ఇంతకీ ఆ టోనర్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్న విష‌యాలు తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు, ( Fenugreek )వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక నాలుగు రెబ్బలు వేపాకు మరియు గ్రైండ్ చేసి పెట్టుకున్న అవిసె గింజలు( Flax Seeds ), మెంతుల పొడి వేసి ఉడికించాలి.

Telugu Dandruff, Care, Care Tips, Healthy, Latest-Telugu Health

దాదాపు పది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ గోరువెచ్చగా అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా మిక్స్ చేస్తే మన టోనర్ సిద్ధం అవుతుంది.ఈ టోనర్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు( Hair ) మొత్తానికి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.

Telugu Dandruff, Care, Care Tips, Healthy, Latest-Telugu Health

గంట లేదా గంటన్నర అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఈ న్యాచురల్ టోనర్ ను వాడటం వల్ల ఒక్క వాష్ లోనే చాలా వరకు చుండ్రు మాయం అవుతుంది.స్కాల్ప్ హెల్తీగా మరియు హైడ్రేట్ గా మారుతుంది.

అలాగే ఈ టోనర్ జుట్టు కుదుళ్ళను దృఢంగా మారుస్తుంది.జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

మరియు సిల్కీ అండ్ షైనీ హెయిర్ ను మీ సొంతం చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube