ప్రపంచంలో దాదాపు 70 శాతం మంది తమ రోజును టీ లేదా కాఫీతో ప్రారంభిస్తూ ఉంటారు. టీ, కాఫీ( Tea, coffee )ల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.
ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ వాటర్ మాత్రం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ వాటర్ తాగితే వెయిట్ లాస్ తో సహా అదిరిపోయే లాభాలు మీ సొంతం అవుతాయి.
మరి ఇంతకీ ఆ మ్యాజికల్ వాటర్ ఏంటి.? అన్నది తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక గ్లాసు తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek ) వేసుకోవాలి.అలాగే రెండు దంచిన యాలకులు, చిటికెడు ఇంగువ వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి.మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో నానబెట్టుకున్న మెంతులు, యాలకులు, ఇంగువను వాటర్ తో సహా వేసుకుని దాదాపు పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.
రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ వాటర్ ను తాగితే ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు పొందుతారు.ముఖ్యంగా ఈ వాటర్ మెటబాలిజం రేటును పెంచుతుంది.కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది.వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది.
అలాగే ఇప్పుడు చెప్పుకున్న మ్యాజికల్ వాటర్ ను రోజు తయారు చేసుకుని తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ( Digestion ) చురుగ్గా మారుతుంది.మలబద్ధకం సమస్య ఉంటే దూరమవుతుంది.

అదే సమయంలో రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్‌లో ఉంటుంది.మోకాళ్ళ నొప్పులు దూరం అవుతాయి.జుట్టు రాలడం తగ్గుతుంది.చర్మం యవ్వనంగా మెరుస్తుంది.మరియు మెంతులు, యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన రోగ రోధక వ్యవస్థను బలపరుస్తాయి.వ్యాధులకు వ్యతిరేకంగా శరీరాన్ని సిద్ధం చేస్తాయి.







