చాలా మంది అమ్మాయిలు తమ జుట్టు ఒత్తుగా మరియు సిల్కీ గా ఉండాలని కోరుకుంటారు.సిల్కీ హెయిర్ పొందడం సులభమే.
కానీ హెయిర్ థిక్ గా మారాలి అంటే కచ్చితంగా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం.అయితే జుట్టును ఒత్తుగా మార్చడానికి పలు ఇంటి చిట్కాలు అద్భుతంగా సహాయపడుతుంటాయి.
ఇప్పుడు చెప్పబోయే రెమెడీ కూడా ఆ కోవకే చెందుతుంది.ఈ రెమెడీని పాటించడం ద్వారా చాలా త్వరగా ఒత్తైన మరియు సిల్కీ హెయిర్( Silky hair ) ను పొందవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు మందారం పువ్వులు వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులు, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు( Flax seeds ) వేసుకోవాలి.ఆ తర్వాత ఒక కప్పు అన్నం గంజి వేసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పదార్థాలను గంజి తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటించడం ద్వారా అద్భుత ఫలితాలు మీరు పొందుతారు.అవిసె గింజలు, మెంతులు, మందారం( Hibiscus ) మరియు అన్నం గంజిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.అవి జుట్టు ఆరోగ్యానికి తోడ్పడతాయి.జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.ఎంత పల్చగా ఉన్న జుట్టు అయినా సరే తరచుగా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని పాటిస్తే కొద్ది రోజుల్లోనే కురులు ఒత్తుగా మారతాయి.
అదే సమయంలో సిల్కీగా మెరుస్తాయి.ఒత్తైన సిల్కీ హెయిర్ ను కోరుకునే వారికి ఈ రెమెడీ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.
.