నెలసరి ఆలస్యం( Delayed Period ) కావడం.దాదాపు ప్రతి మహిళ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొనే ఉంటారు.
ఎప్పుడో ఒకసారి నెలసరి ఆలస్యమైతే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు.కానీ కొందరికి ప్రతినెలా నెలసరి ఆలస్యం అవుతూ ఉంటుంది.
దీన్నే ఇర్రెగ్యులర్ పీరియడ్స్( Irregular periods ) అని పిలుస్తారు.ప్రెగ్నెన్సీ కోసం ఆరాటపడుతున్న వారు నెలసరి ఆలస్యమైనా ఏమాత్రం ఆందోళన చెందరు.
కానీ మిగిలిన వారికి మాత్రం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ విషయంలో తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు.
అసలు ప్రతిసారి నెలసరి ఆలస్యం కావడానికి కారణాలేంటి.
ఈ సమస్యను ఇంట్లోనే ఎలా పరిష్కరించుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ప్రెగ్నెన్సీ కాకుండా నెలసరి ఆలస్యం కావడానికి అనేక కారణాలు ఉంటాయి.ఒత్తిడి, గర్భ నిరోధక( Stress, contraception ) మాత్రలు వాడడం, అధిక బరువు, అకస్మాత్తుగా బరువు తగ్గడం, వ్యాయామం అధికంగా చేయడం, హార్మోన్ల హెచ్చుతగ్గులు, మెనోపాజ్, పీసీఓఎస్, డయాబెటిస్ అదుపులో లేకపోవడం, హైపర్ థైరాయిడ్ తదితర కారణాల నెలసరి ఆలస్యం అవుతుంటుంది.

అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను నిత్యం కనుక తీసుకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి.ఈ డ్రింక్ కోసం ముందుగా అర అంగుళం అల్లం ముక్కను( ginger ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి సన్నగా తురుముకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో అల్లం తురుముతో పాటు ఐదు నుంచి ఆరు తులసి ఆకులు( Basil leaves ) వేసి కనీసం పన్నెండు నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు సేవించాలి.

ఈ అల్లం తులసి టీ ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా మహిళలు నిత్యం ఉదయాన్నే ఈ టీ ను తీసుకోవడం వల్ల చాలా లాభాలే ఉన్నాయి.తులసి ఆండ్రోజన్, ఇన్సులిన్ హార్మోన్ల విడుదలను నియంత్రిస్తుంది.అలాగే అల్లం ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది.ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యకు చెక్ పెట్టడానికి అల్లం తులసి టీ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ టీను తాగడం వల్ల టైమ్ కి నెలసరి వస్తుంది.
అలాగే ఈ టీ రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతు వాపు వంటి సమస్యలను తరిమికొడుతుంది.
మెంటల్ స్ట్రెస్‌ను సైతం దూరం చేస్తుంది.