కొత్త దర్శకుడు యదు వంశీ దర్శకత్వం వహించిన తాజా చిత్రం కమిటీ కుర్రోళ్ళు( Committee Kurrollu ).ఈ సినిమాను మెగా డాక్టర్ కొణిదెల నిహారిక నిర్మించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో 11 మంది హీరోలు నలుగురు హీరోయిన్లు నటించారు.వీరితోపాటుగా సాయికుమార్, గోపరాజు రమణ, శ్రీలక్ష్మి, కిషోర్ తదితరులు ముఖ్యపాత్రలో నటించారు.
అయితే నిహారిక ఇప్పటివరకు చాలా వెబ్ సిరీస్ లను నిర్మించగా మొదటిసారి సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది.ఆమె సినిమాను ప్రొడ్యూస్ చేయడం ఆ సినిమా థియేటర్లలో విడుదల కావడం ఇదే మొదటిసారి.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా నేడు అనగా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమా కథ ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే.
కథ :

గోదావరి జిల్లాల్లోని ఒక గ్రామంలో పన్నెండు ఏళ్ళకు ఒకసారి జాతర వస్తుంది.ఈసారి జాతర జరిగిన పది రోజులకు ఎన్నికలు కూడా జరుగుతాయి.ఆ ఎన్నికల్లో శివ (సందీప్ సరోజ్) సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి ముందుకు వస్తాడు.కానీ జాతరలో చివరలో శివ స్నేహితుల్లో ఒకరుప్రాణాలు కోల్పోతాడు.అందుకు స్నేహితుల మధ్య జరిగిన కులాల గొడవ కారణం.దాంతో జాతర జరిగే వరకు ఎటువంటి ఎన్నికల ప్రచారం వద్దని ఊరి పెద్దలు పంచాయితీలో తీర్పు ఇస్తారు.మరి కులాల గొడవ కారణంగా విడిపోయిన ఆ స్నేహితులు మళ్ళీ ఒక్కటయ్యారా లేదా? అలాగే పన్నెండేళ్ల క్రితం జరిగిన గొడవను ఎప్పటికప్పుడు రగిలిస్తూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం పరితపించే ఊరి జనాలు ఎవరు? ఇందులో ప్రెసిడెంట్ పోలిశెట్టి బుజ్జీ పాత్ర ఏమిటి? చివరికి ఏమయ్యింది? శివ సర్పంచ్ గా పోటీ చేసి గెలుస్తాడా లేదా ఈ విషయాలన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :

ఇందులో పరిస్థితులకు అనుకూలంగా ప్రవర్తించే పాత్రలో విచక్షణతో వ్యవహరించే మనుషులు కనిపిస్తారు.అలాగే ఇందులో ఫస్ట్ అఫ్ మొత్తం అంతా కూడా పాత్రలోనూ ఇంట్రడక్షన్ చేయడం, యువతను జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లడం లాంటివి చేశారు.అలాగే ఊహ తెలియని వయసులో, కులాల గురించి అవగాహన లేని మనసుల మధ్య స్నేహాన్ని యదు వంశీ చక్కగా ఆవిష్కరించారు.
అప్పట్లో మొబైల్స్ లేని రోజుల్లో పిల్లల జీవితాలు ఏ విధంగా ఉండేవి అన్న విషయాన్ని చాలా చక్కగా చూపించారు.ఇక ఇందులో అనుదీప్ దే( Anudeep Dev )వ్ సంగీతం కుడా చాలా బాగుంది.అలాగే మధ్య మధ్యలో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవిస్తాయి.
నటీనటుల పనితీరు :
ఈ సినిమాలో నటీనటులు ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారు.ఇందులో హీరో ఓటమి తర్వాత చెప్పే డైలాగులు జనసేన ప్రస్థానాన్ని గుర్తు చేస్తాయి.నటీనటులు అందరూ టీనేజ్, ట్వంటీస్ మధ్య డిఫరెన్స్ చూపించారు.సాయి కుమార్, గోపరాజు రమణ నటనలో అనుభవం కనిపించింది.అలాగే హీరోలందరూ ఎవరు ఎక్కువ తక్కువ అని కాకుండా 11 మంది హీరోలు కూడా బాగానే నటించారు.
శివ పాత్రలో సందీప్ సరోజ్,( Sandeep Saroj ) సుబ్బుగా త్రినాథ్ వర్మ, విలియం పాత్రలో ఈశ్వర్ రచిరాజు, సూర్యగా యశ్వంత్ పెండ్యాల నటన ఎక్కువ రిజిస్టర్ అవుతుంది.ఆ నలుగురూ ఎమోషనల్ సన్నివేశంలో పరిణితి చూపించారని చెప్పాలి.
సాంకేతికత :

అనుదీప్ దేవ్ సంగీతం సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకువెళ్ళింది.పాటలు కూడా బాగున్నాయి.నేపథ్య సంగీతం అంతకు మించి ఉంది.జాతర ఎపిసోడ్ అంతా రీ రికార్డింగ్ హైలైట్ అవుతుంది.అలాగే, కెమెరా వర్క్ కూడా బావుంది.