రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి ఒకటి కంటే ఎక్కువ సినిమాలు తీసిన హీరోయిన్లు కొందరు ఉన్నారు.వారు ప్రభాస్ కు ఆన్‌స్క్రీన్‌పై ఫర్ఫెక్ట్ జోడి అయ్యారు.
అందుకే వారి కాంబో రిపీట్ అయింది.మరి బాహుబలి స్టార్ ప్రభాస్ తో ఎక్కువ సినిమాలు చేసిన ఆ లక్కీ హీరోయిన్స్ ఎవరో చూద్దాం.
• ప్రభాస్, అనుష్క శెట్టి
ప్రభాస్, అనుష్క శెట్టి ( Prabhas , Anushka Shetty ) ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండుతుంది.వీళ్లిద్దరూ కూడా మంచి హైట్ ఉంటారు.
మంచి అందం వీరి సొంతం.ఒక మహారాజు, ఒక మహారాణిలా కనిపిస్తారు.
అందుకే దర్శకులు వీరిద్దరి కాంబోలో సినిమాలు తీయడానికి బాగా ఇష్టపడుతుంటారు.ఇప్పటికే ప్రభాస్, అనుష్క శెట్టి కలిసి మొత్తం 4 సినిమాల్లో కలిసి పనిచేశారు.
అవి బిల్లా, మిర్చి, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్.వారి ఆన్-స్క్రీన్ పార్ట్‌నర్‌షిప్ 2009 చిత్రం బిల్లాతో ప్రారంభమైంది, ఇది వారి మొదటి కాంబో మూవీ.
బిల్లా సినిమాలో అనుష్క వెంట ప్రభాస్ పడుతుంటాడు.ఆమెను ఇంప్రెస్ చేయడానికి బాగా ప్రయత్నిస్తాడు.
ఆ సీన్లు చాలా బాగుంటాయి.ఇక బాహుబలిలో అనుష్క, ప్రభాస్‌ల సీన్లు మరింత అద్భుతంగా ఉంటాయి.
• ప్రభాస్ – త్రిష
సౌత్ ఇండియన్ క్వీన్ త్రిష( Trisha ) యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి మొత్తం మూడు సినిమాల్లో యాక్ట్ చేసింది.2004లో వచ్చిన వర్షం సినిమాతో వీరు తొలిసారిగా జత కట్టారు.హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా వచ్చిన వర్షం సినిమాలో ప్రభాస్ – త్రిష చాలా ఘాటైన రొమాన్స్ చేస్తారు.పాటల్లో కూడా సెగలు పుట్టిస్తారు.వర్షం సినిమాకి త్రిషనే మెయిన్ స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు.దీని తర్వాత వీరిద్దరూ కలిసి యాక్షన్ మ్యూజికల్ డాన్స్ ఫిలిం “పౌర్ణమి” చేశారు.
ఈ మూవీలో కూడా వీరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన లాస్ట్ సినిమా బుజ్జిగాడు.
ఇందులో వీరి మధ్య సన్నివేశాలు చాలా కామెడీగా ఉంటాయి.
• ప్రభాస్ – కాజల్
ప్రభాస్, కాజల్ ( Prabhas, Kajal )కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చాయి.అందులో ఒకటి డార్లింగ్.ఇంకొకటి మిస్టర్ పర్ఫెక్ట్.
ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.వీరి జోడి చాలామందికి తెగ నచ్చేసింది.
• ప్రభాస్ – తమన్నా
( Prabhas – Tamannaah )
ప్రభాస్, తమన్నా కలిసి బాహుబలి, రెబల్ సినిమాల్లో నటించారు.