యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ( Junior NTR, Prashant Neel )కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈరోజు జరిగాయి.తారక్ ప్రశాంత్ నీల్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.ఈ సినిమాకు డ్రాగన్ ( Dragon )అనే టైటిల్ ఫిక్స్ అయిందని ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వినిపించాయి.2026 సంవత్సరం జనవరి 9వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత సంక్రాంతి పండుగను మరోసారి టార్గెట్ చేశారు.వాస్తవానికి ఆర్ఆర్ఆర్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆ సమయానికి విడుదల కాలేదు.రెండేళ్ల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడగా త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.2025లో తారక్ నటిస్తున్న వార్2 మూవీ( War2 movie ) విడుదల కానుంది.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో రష్మిక ( Rashmika )హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.ఎన్టీఆర్, రష్మిక కాంబినేషన్ లో ఇదే తొలి సినిమా కావడం గమనార్హం.మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక అప్ డేట్స్ రానున్నాయి.
తన సినిమాలు స్పెషల్ డేస్ లో మాత్రమే విడుదలయ్యేలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్లానింగ్స్ ఉన్నాయి.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా తారక్ సినిమాలు చెప్పిన విధంగా విడుదలైతే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.ఎన్టీఆర్ త్వరలో కొత్త సినిమాలను సైతం ప్రకటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ భారీ స్థాయిలోనే ఉందని భోగట్టా.