మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పటికీ స్టడీ కలెక్షన్ లను సాధిస్తూ ముందుకు దూసుకు వెళుతోంది.ఈ సినిమాను ఎంతో అద్బుతముగా దర్శకధీరుడు జక్కన్న తీర్చి దిద్దారు.
ఒక సినిమాను తెరకెక్కించడానికి రాజమౌళి ఇన్ని సంవత్సరాలు ఎందుకు తీసుకుంటారు అనేదానికి ఒక సమాధానం తెరమీదనే చూడాలి.ప్రతి ఒక్క సీన్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుని షూట్ చేస్తాడు రాజమౌళి.
ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించిన రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు పోటీ పడి మరీ నటించారు.తమ తమ ఫ్యాన్స్ కొట్టుకునేలా ఉంది వీరిద్దరి నటన.ఒక చారిత్రాత్మకమైన లైన్ ను తీసుకుని ఒక అద్భుత కావ్యంగా మలిచాడు జక్కన్న.
ఇందులో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మరియు హాలీవుడ్ లండన్ బ్యూటీ ఒలీవియా మోరిస్ లు నటించారు.
వీరు ఇద్దరూ కూడా తమ పరిధి మేరకు నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు.అయితే మొదటి నుండి ఈ సినిమాలో నటించిన అలియా భట్ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంది.
ఒలీవియా ను పెద్దగా పట్టించుకోలేదు.కానీ సినిమా విడుదల అయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయింది.
అలియా భట్ కన్నా కూడా ఒలీవియా కే ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండడం, మరియు నటనకు అధిక ప్రాధాన్యత ఉండడంతో ప్రేక్షకులు జెన్నీ పాత్రకు బాగా కనెక్ట్ అయ్యారు.ఈమెకు పెరుగుతున్న ఆదరణ చూస్తుంటే తెలుగులో మరిన్ని సినిమాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లదు.
ఈ సినిమాలో ఒలీవియా చలాకీ తనం మరియు నటన చూస్తే చాలా ముచ్చటేస్తుంది.ఈమెను అభిమానించే వారు రోజు రోజుకీ ఎక్కువైపోతున్నారు.అయితే ఈమె వ్యక్తిగత జీవితం గురించి తెలియని ఒక ముఖ్యమైన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.25 సంవత్సరాలు ఉన్న అందాల ఒలీవియాది ఇంగ్లాండ్ లోని లండన్.ఒలీవియా ఈ సినిమాకన్నా ముందుగా హాలీవుడ్ లోని కొన్ని సినిమాలు మరియు వెబ్ సిరీస్ లలో నటించి ప్రాచుర్యం పొందినది.ఈమె వ్యక్తిగత జీవితంలో లవర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయాన్నీ మీడియాతో పంచుకుంది.
ఈమె మాట్లాడుతూ నేను నటించిన మొదటి తెలుగు సినిమా ఆర్ ఆర్ ఆర్ ను చూసిన నా బాయ్ ఫ్రెండ్ జాక్ హమ్మెట్ చాలా బాగుందని, అందులో నా నటనను ప్రత్యేకించి మెచ్చుకున్నాడని తెలిపింది.ఈ సినిమాలో అందరికీ బాగా నచ్చిన “నాటు నాటు…” పాటకు కూడా ఒలీవియా బాయ్ ఫ్రెండ్ డాన్స్ నేర్చుకుంటున్నట్లు ఈమె తెలిపింది.అంతే కాకుండా ఈమె తన బాయ్ ఫ్రెండ్ తో గత అయిదు సంవత్సరాలా నుండి డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
మరియు వీళ్ళు లండన్ లో ఒక ఇల్లును తీసుకుని అందులో కలిసి ఉంటున్నారు.