కరోనా ప్రభావం వల్ల థియేటర్లు మూత పడటంతో డిజిటల్ ప్లాట్ ఫామ్ లకు మంచి ఆదరణ లభించింది.ఈ క్రమంలోనే టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలుగు ఓటీటీ ఆహాను ప్రారంభించారు.
ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఆహా వేదికగా ఎన్నో రకాల కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. టాక్ షో, కుకింగ్ షో, వెబ్ సిరీస్, సినిమాలు ప్రసారం చేస్తూ అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.
ఈ విధంగా తెలుగులో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న ఆహాను తమిళంలో కూడా ప్రారంభించాలని అల్లుఅరవింద్ తీవ్రంగా శ్రమించారు.
ఈ క్రమంలోనే తమిళ నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా తమిళ ఆహాను ఎంతో ఘనంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేతుల మీదుగా ప్రారంభించారు.
చెన్నైలోని లీలా ప్యాలెస్ లో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది.ఇక ఈ కార్యక్రమానికి కోలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ ఉదయ్ నిధి స్టాలిన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, ఎస్ జే సూర్య హాజరయ్యారు.
అదే విధంగా కోలీవుడ్ స్టార్ హీరో శింబు, సంగీత దర్శకుడు అనిరుధ్ కూడా హాజరయ్యారు వీరిద్దరూ తమిళ ఆహాకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు.
ఇక ఈ కార్యక్రమం ప్రారంభమైన అనంతరం “తట్టిన తమిళ్ మట్టుమే” అనే సినిమాను ఆహా తమిళ్ లో ప్రసారం చేశారు. అలాగే పలువురు తమిళ సినీ దిగ్గజాలకు ఆహా యాజమాన్యం “కలైంజర్ హానర్” పురస్కారాన్ని అందించారు.ఇక ఆహా తమిళంలో ఎంతో ఘనంగా ప్రారంభంకావడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్వీడియో బైట్ ద్వారా ఆహా తమిళ్ టీమ్ కి తన విషెస్ తెలిపారు.
ఇకపై ఆహా తమిళ్ ద్వారా తమిళంలో వెబ్ సిరీస్, సినిమాలు, టాక్ షో నిరంతరం ప్రసారం అవుతూ తమిళ ప్రేక్షకులను సందడి చేయనుంది.