మద్యపానం( Alcohol ) ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు.పైగా ప్రస్తుత రోజుల్లో మందు కొట్టడం అనేది ఫ్యాషన్ అయిపోయింది.
మద్యం ఆనందానికి, రిలాక్సేషన్‌కి గుర్తుగా మారిపోతుంది.మగవారే కాకుండా ఆడవారు కూడా ఆల్కహాల్ ను అలవాటు చేసుకుంటున్నారు.
అయితే వీకెండ్స్ లో మందు కొట్టి చిందేసేవారు కొందరైతే.నిత్యం మద్యం తాగే వారు మరికొందరు.
నిత్యం మద్యం తాగే వారు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.రెగ్యులర్‌గా మద్యం తాగడం వల్ల ఆరోగ్యపరంగా, మానసికంగా, సామాజికంగా అనేక సమస్యలు వస్తాయి.
శారీరకంగా రోజూ మందు కొట్టేవారిలో కాలేయ కణాలు దెబ్బతినడం, ఫ్యాటీ లివర్( Fatty Liver ) వంటి జబ్బులు తలెత్తుతాయి.లివర్ పూర్తిగా క్షీణించి, జీవితం ప్రమాదంలో పడే స్థితి కూడా ఏర్పడవచ్చు.
అలాగే రెగ్యులర్ గా డ్రింక్ చేసేవారిలో జ్ఞాపకశక్తి తగ్గడం, విపరీతమైన ఒత్తిడి, ఆందోళన, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, గుండె వీక్ గా మారడం, మెదడుకు రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం, హై బీపీ, అసిడిటీ, స్టమక్ అల్సర్, శరీర రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తినడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి.

మద్యం తాగిన తర్వాత మానసిక స్థితి( Mental Health ) మారిపోతుంది.భావోద్వేగాలపై కంట్రోల్‌ను కోల్పోతారు.ఒంటరితనం, నిరాశ ఎక్కువగా అనిపిస్తాయి.
చిన్న విషయాలపై కూడా ఎక్కువగా రెచ్చిపోతుంటారు.ఫలితంగా కుటుంబంలో విభేదాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడతాయి.
వీటి ప్రభావం ఇంట్లో ఎదిగే పిల్లలపై తీవ్రంగా పడుతుంది.మద్యపానం వల్ల అటు ఆరోగ్యం చెడిపోతుంది.
ఇటు జీవితం నశనం అవుతుంది.ఇష్టమైనవారు దూరమవుతారు.
గౌరవమర్యాదలను కోల్పోతారు.అంతకుమించి బోలెడంత ఆర్థిక నష్టం.

సో.ఆవగింజంత ప్రయోజనం లేని మద్యాన్ని నిత్యం తాగుతూ దానికి బానిసైపోయిన వారు ఇకనైనా మారండి.మీకోసం మారండి.ఏళ్ల నుంచి ఉన్న చెడు అలవాటును ఇప్పటికప్పుడు వదిలించుకోవడం కష్టమే.కానీ పట్టుదలతో ప్రయత్నించండి.మద్యం పూర్తిగా మానేయాలా? లేక మెల్లగా తగ్గించుకోవాలా? అనే విషయాన్ని నిర్ణయించుకోండి.మద్యం మానడానికి కుటుంబ సభ్యులు, మంచి స్నేహితుల సపోర్ట్ తీసుకోండి.అవసరమైతే కౌన్సిలింగ్ లో చేరండి.