ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత మొదటిసారిగా జరగబోతున్న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ముఖ్యంగా అధికార టిడిపి, జనసేన, బిజెపి కూటమి( TDP Janasena BJP Alliance ) ఎన్నికల్లో గెలిచేందుకు అనేక వ్యూహాలు రచిస్తోంది .
తమకు గెలిచే అంతటి బలం లేకపోయినా, వైసీపీ స్థానిక సంస్థల ఓటర్ల నుంచి ఊహించని స్థాయిలో తమకు మద్దతు లభిస్తుందని అంచనా వేస్తుండగా, వైసిపి కూడా గెలుపు పై ధీమాతో ఉంది.తమకు గెలుపుకు అవసరమైన ఓట్లు ఉన్నాయని ,ఎన్నికల్లో తప్పకుండా తామే గెలుస్తామని ధీమాను వ్యక్తం చేస్తోంది ఇప్పటికే వైసీపీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీమంత్రి బొత్స సత్యనారాయణ ను( Botsa Satyanarayana ) ప్రకటించింది.
ఈ సిట్టింగ్ సీటును ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకుండా బొత్స ను గెలిపించుకోవాలని పట్టుదలతో వైసిపి( YCP ) ఉంది.దీనిలో భాగంగానే విశాఖ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ప్రలోభాలకు లొంగవద్దని, బెదిరింపులకు భయపడవద్దని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు.
అనకాపల్లి , నర్సీపట్నం , పాయకరావుపేట ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ క్యాడర్ తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి క్యాడర్ నుంచి ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
స్థానిక సంస్థల కోటాలో ఈ ఎన్నిక జరుగుతుంది.
జీవీఎంసీ, మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండే ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు.వైసీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు,( Golla Baburao ) ఎమ్మెల్సీలు రవిబాబు , వరదు కళ్యాణి ఓటర్లుగా దరఖాస్తు చేసుకున్నారు.ఓటర్ల జాబితా పై అభ్యంతరాలు చెప్పేందుకు గడువు ముగిసింది .ఎల్లుండి ఓటర్ల తుది జాబితాను అధికారులు ప్రకటించనున్నారు.రేపు వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఎన్డీఏ కూటమి నుంచి అభ్యర్థిగా ఎవరిని పోటీకి దింపుతారనేది ఇంకా తేలలేదు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు మాదిరిగానే ఎమ్మెల్సీ పదవులు కూడా గెలుచుకుంటామని కూటమి పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి.