మన తెలుగులో ఉన్న కమెడియన్లు ఎక్కడా లేరని చెప్పుకోవచ్చు.కమెడియన్లు ప్రజల్లో నెలకొన్న హాస్యాన్ని మటుమాయం చేయగలరు.
బ్రహ్మానందం, వేణుమాధవ్, ఎమ్మెస్ నారాయణ, సత్య, రఘుబాబు, ఏవీఎస్, సుధాకర్, రాజేంద్రప్రసాద్ లాంటివి కమెడియన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు.ఇక మొదటి తరం తెలుగు కమెడియన్లలో రేలంగి వెంకట్రామయ్య( Relangi Venkatramaiah )కు గొప్ప పేరు వచ్చింది.
ఆయన స్క్రీన్‌పై కనిపిస్తేనే ప్రేక్షకులు ఆటోమేటిక్‌గా చిరునవ్వులు చిందించేవారు.ఇక ఫన్నీ డైలాగులు చెబుతూ కామెడీగా యాక్ట్ చేస్తుంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునేవారు.
ఎన్నో కామెడీ పాత్రలతో ఆయన ప్రజలను బాగా నవ్వించేవారు.అందుకే భారత ప్రభుత్వం రేలంగిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
మన దేశంలో ఆ అత్యుత్తమ పౌర పురస్కారం అందుకున్న తొలి హాస్యనటుడు రేలంగే కావడం విశేషం.ఈ హాస్య నటచక్రవర్తి జీవితంలో ఎన్నో కష్టాలు, అనారోగ్యాలను చవిచూశారు.
అయినా ప్రజలను నవ్వించడం మాత్రం మానేయలేదు.
ఈ దిగ్గజ హాస్య నటుడు 1910, ఆగస్టు 9న రావులపాలెం సమీపంలోని రావులపాడులో రామస్వామి, తల్లి అచ్చాయమ్మ దంపతులకు పుట్టారు.ఈయనకు సోదరులు సోదరీమణులు ఎవరూ లేరు.తల్లిదండ్రులకు ఆయన ఒక్కగానొక్క సంతానం.
మూడేళ్ల వయసులోనే అతని తల్లి కన్నుమూశారు.ఆ తర్వాత అచ్చాయమ్మ చెల్లెలు గౌరమ్మను రేలంగి తండ్రి వివాహం చేసుకున్నారు.
రేలంగి తాతలు ఆబ్కారీ బిజినెస్ చేసేవారు.కానీ ఆ వ్యాపారం ఇష్టం లేక రామస్వామి ఓ స్కూల్లో మ్యూజిక్ టీచర్‌గా వర్క్ జాయిన్ అయ్యారు.
హరికథలు ఎలా చెప్పాలో కూడా నేర్పించేవారు.ఆ కళలన్నీ రేలంగి కూడా నేర్చుకున్నారు.
కానీ కొడుకు ఇలాంటి కలలు నేర్చుకోవడం రామస్వామికి ఇష్టం ఉండకపోయేది కాదు ఆయన పెద్ద చదువులు చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలని తండ్రి కోరుకునేవారు.కానీ, రేలంగి నాటకాల మోజులో పడి 9వ తరగతితో స్టడీస్‌కి ఫుల్ స్టాప్ పెట్టేశారు.ఇక రామస్వామి చేసేదేమీ లేక నాటకాల్లోనైనా బాగా రాణించు అని ప్రోత్సహించారు.1919లోనే యంగ్‌మెన్ హ్యాపీ క్లబ్లో చేరి రేలంగి అద్భుతమైన డ్రామాలు వేస్తూ చాలా పేరు తెచ్చుకున్నారు.ఎస్వీ రంగారావు, అంజలీదేవి వంటి వాళ్లు అక్కడే ఆయనకు పరిచయమయ్యారు.ఆ కాలంలో స్త్రీ పాత్రలు చేసేందుకు ఆడవాళ్లు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు.అందువల్ల రేలంగే ఆ వేషాలన్నీ వేసేవారు.1935 వరకు నాటకాల్లో రాణించిన రేలంగి తర్వాత ‘శ్రీకృష్ణ తులాభారం( Sri Krishna Tulabharam)’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు ఆ మూవీ పెద్దగా ఆడలేదు కాబట్టి రేలంగి పాత్రకు గుర్తింపు రాలేదు.
అవకాశాలు కూడా రావడంతో మళ్లీ కాకినాడకు వచ్చి నాటకాలు ప్రారంభించారు.ఈ క్రమంలోనే దర్శకుడు సి.పుల్లయ్యను పరిచయం అయ్యారు.ఆయన దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడక్షన్ అసిస్టెంట్, క్యాస్టింగ్ అసిస్టెంట్, ప్రొడక్షన్ మేనేజర్.
ఇలా పలు శాఖల్లో దాదాపు 15 ఏళ్లు వర్క్ చేస్తూ సినిమాలపై చాలా అవగాహన పెంచుకున్నారు.క్యాస్టింగ్ ఏజెంట్ పనిచేస్తూ పుష్పవల్లి, కృష్ణవేణి, భానుమతి, అంజలీదేవి వంటి అద్భుతమైన గొప్ప నటీమణులను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశారు.
భానుమతి, అంజలీదేవి సినిమాల్లో క్లిక్ అయి నిర్మాతలుగా మారాక రేలంగికి తాము ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు.అలా కృతజ్ఞతలు తెలుపుకున్నారు.రేలంగి ‘వింధ్యరాణి (1948)’, ‘కీలుగుర్రం (1949)’ సినిమాల్లో మంచి కామెడీ రోల్స్ చేసి ఒక్కసారిగా పాపులరయ్యారు కె.వి.రెడ్డి ‘గుణసుందరి కథ’ సినిమాలో ఒక మంచి రోల్ దక్కించుకున్నాడు.దాని తర్వాత రేలంగికి అవకాశాలు పదుల సంఖ్యలో వచ్చాయి.
అప్పటినుంచి రేలంగి కెరీర్లో వెనుదిరిగి చూసుకోలేదు.మిస్సమ్మ, మాయాబజార్, పాతాళభైరవి, అప్పుచేసి పప్పుకూడు, వెలుగు నీడలు, నర్తనశాల, వంటి సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు హీరో పాత్రలతో సమానంగా పాపులర్ అయ్యాయి.
వినవే బాల.నా ప్రేమగోల, ధర్మం చెయ్ బాబూ, సరదా సరదా సిగరెట్టు.వంటి పాటలు ఆయన సొంతంగా పాడి సినిమా ఇండస్ట్రీలో గొప్ప పేరు తెచ్చుకున్నారు.ఆయన సేవలను సత్కరించడానికి పద్మశ్రీ అవార్డు కూడా తక్కువే అని చెప్పుకోవచ్చు.