కొంతమంది హీరోలు గతంలో తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన కొన్ని సినిమాలను రీమేక్ చేయాలని కోరుకుంటున్నారు.ఒరిజినల్ సినిమాల కంటే మంచి ప్రొడక్షన్ వాల్యూలతో, కొన్ని మార్పులతో ఆ సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి మంచి హిట్స్ అందుకోవాలని చూస్తున్నారు.వాళ్లు ఎవరో, వాళ్లు రీమేక్ చేయాలని యోచిస్తున్న సినిమాలు ఏవో చూద్దాం.
• విశ్వక్సేన్ – నా అల్లుడు
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ( Hero Vishwak Sen )యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని.ఇటీవల ఈ హీరో “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమా( “Gangs of Godavari” movie ) ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.అయితే అతను ఎన్టీఆర్ ఫ్యాన్ అని తెలుసు కాబట్టి తారక్‌కు సంబంధించిన ప్రశ్నలు వేశారు.“ఎన్టీఆర్ సినిమాల్లో ఏదైనా రీమేక్ చేయగల ఛాన్స్ వస్తే మీరు ఏ సినిమా రీమేక్ చేస్తారు” అని ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు.దానికి “నా అల్లుడు” అని విశ్వక్సేన్ టక్కున సమాధానం చెప్పాడు.
దాంతో అందరూ షాక్ తిన్నారు.ఎందుకంటే ఈ సినిమా డిజాస్టర్ అయింది.
ఇది ఎలాంటి లాజిక్ సెన్స్ లేకుండా అడల్ట్ జోకులు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో తెరకెక్కింది.ఈ డిజాస్టర్ సినిమాని మళ్లీ రీమేక్ చేయడం అనవసరం.
పైగా ఒరిజినల్లో రమ్య కృష్ణ, శ్రియ, జెనీలియా నటించారు.రీమేక్‌లో వారి లాంటి నటీమణులను కనిపెట్టడం కష్టం.
• భక్త కన్నప్ప – ప్రభాస్
( Bhakta Kannappa – Prabhas )
బాపు డైరెక్ట్ చేసిన భక్త కన్నప్ప (1976) సినిమా సూపర్ హిట్ అయింది.ఇందులో అర్జునుడు, కన్నప్ప, తిన్నడుగా కృష్ణం రాజు అద్భుతంగా యాక్ట్ చేశాడు.ఈ సినిమాలోని సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి.తన పెదనాన్న కృష్ణం రోజు చేసిన ఈ సినిమా అంటే ప్రభాస్ ( Prabhas )కు చాలా ఇష్టం.
అందుకే దీన్ని రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు.ఇప్పుడు ఉన్న టెక్నాలజీలతో, సాధ్యమైనన్ని మంచి మార్పులతో చేద్దామని భావించాడు.కానీ ఈలోగా మంచు విష్ణు ఈ మూవీ రీమేక్ చేయడం స్టార్ట్ చేశాడు.సో ప్రభాస్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
విష్ణు సినిమాలో మాత్రం నందిగా ప్రభాస్ ఓ స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వనున్నాడు.
• నితిన్ – శ్రీ ఆంజనేయం
( Nitin – Sri Anjaneyam )
నితిన్ తాను నటించిన శ్రీ ఆంజనేయం సినిమాని మరోసారి రీమేక్ చేయాలని భావిస్తున్నాడు.ఇప్పుడు ఉన్న టెక్నాలజీ, వీఎఫ్ఎక్స్తో ఈ సినిమా మంచిగా తీస్తే కచ్చితంగా హిట్ అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.