ఎమ్మెల్సీ ఎన్నికలు : పోటీపై టీడీపీ తర్జనభర్జన ?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల( MLC Elections ) విషయంలో తజ్జనభజన పడుతోంది.వైసిపి ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ( Vamshi Krishna ) ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ పదవికి,  వైసీపీకి రాజీనామా చేసి జనసేన లో చేరడం , జనసేన నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో , ఈ ఎమ్మెల్సీ స్థానం ఖళీ అయింది.

 Cm Chandrababu Forms Six Members Committee On Visakha Local Body Mlc Elections D-TeluguStop.com

దీనికి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.అయితే ఇక్కడ స్థానిక సంస్థల ఓటర్లు వైసీపీకి( YCP ) ఎక్కువగా ఉండడంతో,  వాస్తవంగా ఇక్కడ వైసిపి గెలుపు అనివార్యంగా మారింది.

టిడిపి కి స్థానిక సంస్థల ఓటర్లు తక్కువగా ఉండడంతో,  టిడిపి పోటీలో ఉన్నా గెలిచే అవకాశం లేదు.దీంతో ఇక్కడి నుంచి పోటీ చేయాలా వద్దా , పోటీ చేస్తే ఎవరిని అభ్యర్థిగా బరిలోకి దించాలనే విషయంలో ఇంకా ఏ క్లారిటీకి రాలేకపోతున్నారు.

Telugu Chandrababu, Cm Chandrababu, Jagan, Janasena, Janasenani, Pavan Kalyan, C

తాజాగా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన టిడిపి ,జనసేన , బిజెపి ఎమ్మెల్యేలు కీలక నాయకులతో సీఎం చంద్రబాబు( CM Chandrababu ) ఉండవల్లి లోని తన నివాసంలో చర్చించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి,  స్థానిక సంస్థల ప్రతినిధుల్లో వైసీపీకి చెందిన వారు  ఎంతమంది టీడీపీ వైపు మొగ్గు చూపుతారు వంటి అనేక అంశాల పైన ఆరా తీశారు.జిల్లా ఎమ్మెల్యేలు , నాయకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Telugu Chandrababu, Cm Chandrababu, Jagan, Janasena, Janasenani, Pavan Kalyan, C

గత వైసిపి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వైసీపీ నుంచి గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధుల్లోనూ చాలామంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారని,  మొదటి పదకొండు నెలలు తప్ప,  ఆ తరువాత వారికి గౌరవ వేతనం కూడా ఇవ్వలేదని , సార్వత్రిక ఫలితాలు తర్వాత చాలామంది టిడిపి జనసేన బిజెపి కూటమి( TDP Janasena BJP Alliance ) వైపు మొగ్గు చూపుతున్నారని కొంతమంది నాయకులు చంద్రబాబుకు తెలిపారు.ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచేందుకు అవసరమైన ఓట్లను కూడగట్టగలమని కొంతమంది భరోసా వ్యక్తం చేయగా,  పోటీకి దూరంగా ఉండటమే మంచిదని మరికొంతమంది నాయకులు సూచించారు .దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఆరుగురు తో కమిటీని చంద్రబాబు నియమించారు.టిడిపి నుంచి పల్లా శ్రీనివాసరావు,  వంగలపూడి అనిత , గంటా శ్రీనివాసరావు , బండారు సత్యనారాయణమూర్తి,  జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు,  బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజులను కమిటీలో నియమించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube