టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) గురించి అందరికీ తెలిసిందే.రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు రవితేజ.ప్రస్తుతం రవితేజ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే రవితేజ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్.దాంతో సోషల్ మీడియా జరుగుతున్న ట్రోలింగ్స్ కు రవితేజ ఫీల్ అవుతున్నారట.
అసలేం జరిగింది రవితేజ పై ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు అన్న విషయానికొస్తే.
![Telugu Raviteja, Bachchan, Raviteja Trolls, Tollywood, Trolls, Young-Movie Telugu Raviteja, Bachchan, Raviteja Trolls, Tollywood, Trolls, Young-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/08/ravi-teja-trolled-for-scenes-with-actress-half-his-age-detailsa.jpg)
సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులకు హీరో హీరోయిన్లకు సోషల్ మీడియాలో ట్రోల్స్( Trolls ) అన్నవి కామన్.పెద్ద పెద్ద కథానాయకుల నుంచి హస్య నటులు వరకు అంతా ట్రోలింగ్ బాధితులే నెటిజన్ల తిట్ల దండకంతో చాలా మంది సెలబ్రెటీలు సోషల్ మీడియా అంటేనే భయపడిపోతున్నారు.ఇప్పుడు ఈ లిస్టులో మాస్ మహరాజ్ రవితేజ కూడా చేరిపోయారట.
ఈ మధ్య సోషల్ మీడియాలో రవితేజను ఎక్కువగా టార్గెట్ చేసుకున్న ట్రోలర్స్.ఒక వర్గం వారు కావాలనే వెంటాడి వెంటాడి మరి వేధిస్తున్నారట.
మాస్ మహారాజ్ రవితేజ సినిమా రిలీజ్ అనగానే సోషల్ మీడియాలో ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు.
![Telugu Raviteja, Bachchan, Raviteja Trolls, Tollywood, Trolls, Young-Movie Telugu Raviteja, Bachchan, Raviteja Trolls, Tollywood, Trolls, Young-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/08/ravi-teja-trolled-for-scenes-with-actress-half-his-age-detailss.jpg)
ముఖ్యంగా రవితేజతో జతకట్టే హీరోయిన్ల విషయంలో ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తోందట.ప్రస్తుతం రవితేజ వయస్సు 56 ఏళ్లు.కానీ ఆయనతో జతకట్టే హీరోయిన్ల వయసు 20 నుంచి 25 ఏళ్లలోపే ఉంటోంది.
దీంతో రవితేజను టార్గెట్ చేస్తున్నారు ట్రోలర్స్.తన వయసులో సగం కూడ లేని హీరోయిన్లతో డ్యాన్స్‌లు, రోమాన్స్ లు ఏంటంటూ ఒక రేంజ్‌లో రెచ్చిపోతున్నారట నెటిజన్స్.
దీనిపై మీడియాలో కూడా అడపాదడపా న్యూస్ వస్తుండటంతో రవితేజ హర్ట్ అవుతున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.