ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో నాగచైతన్య( Naga Chaitanya ) శోభితల( Shobitha ) పేర్లు కూడా ఒకటి.గత రెండు మూడు రోజులుగా ఈ ఇద్దరి పేర్లు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో మారుమోగుతున్న విషయం తెలిసిందే.
గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న ఈ జంట ఇటీవలె ఎంగేజ్మెంట్ వేడుకతో ఒకటైన విషయం తెలిసిందే.అయితే వీరి ఎంగేజ్మెంట్ వేడుక కాకముందు ఎన్నోసార్లు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు అంటూ వార్తలు కూడా వినిపించాయి.
![Telugu Naga Chaitanya, Nagachaitanya, Nagarjuna, Thandel-Movie Telugu Naga Chaitanya, Nagachaitanya, Nagarjuna, Thandel-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/08/sobhita-dhulipala-first-post-after-engagement-detailsa.jpg)
కానీ ఆ వార్తలపై నాగచైతన్య కానీ శోభితగాని స్పందించలేదు.అయితే ఎట్టకేలకు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం చేస్తూ ఎంగేజ్మెంట్ వేడుకతో ఒకటయ్యారు నాగచైతన్య శోభిత. దీంతో కొందరు షాక్ అవ్వగా మరి కొందరు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగచైతన్య శోభితల ఎంగేజ్మెంట్( Naga Chaitanya Shobitha Engagement ) ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా శోభిత నాగచైతన్యతో నిశ్చితార్థం తర్వాత ఒక తొలి పోస్ట్ పెట్టింది.ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇంతకీ ఆ పోస్టులో ఏముంది అన్న విషయానికి వస్తే.
![Telugu Naga Chaitanya, Nagachaitanya, Nagarjuna, Thandel-Movie Telugu Naga Chaitanya, Nagachaitanya, Nagarjuna, Thandel-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/08/sobhita-dhulipala-first-post-after-engagement-detailss.jpg)
ఎంగేజ్‌మెంట్ వేడుక ఫొటోలు షేర్ చేస్తూ.మన పరిచయం ఎలా మొదలైనా? ప్రేమలో మన హృదయాలు కలిసిపోయాయి అంటూ నాగ చైతన్యను ఉద్దేశించి క్యాప్షన్ ను జోడించింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే శోభిత విషయానికి వస్తే.ప్రస్తుతం శోభిత బాలీవుడ్ టాలీవుడ్ అని సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది.
మరోవైపు నాగచైతన్య కూడా వరుసగా సినిమాలలో నటిస్తున్నారు.ప్రస్తుతం నాగచైతన్య తండేల్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.