టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్, సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను( Taapsee Pannu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకప్పుడు తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
కాగా ఈమె తెలుగులో దరువు, మొగుడు, మిషన్ ఇంపాజిబుల్, వస్తాడు నా రాజు, ఝుమ్మంది నాదం, షాడో నీవెవరో,ఆనందో బ్రహ్మ, ఆడు కలం, సాహసం, నీడ, లాంటి ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అలా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తమిళం, హిందీ సినిమాలలో ఎక్కువగా నటిస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా తాప్సి చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాగా డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్ తో( Mathias Boe ) చాలాకాలంగా డేటింగ్లో ఉన్న తాప్సీ ఈ ఏడాది మార్చిలో అతనిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఉదయ్ పూర్లోని ప్యాలెస్ లో వీరిద్దరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది.
అయితే నేటి వరకు వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు బయటకు రాలేదంటే తాప్సీ ఎంత గోప్యత పాటిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.
మథియాస్ గత కొంతకాలంగా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్ చిరాగ్ లకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.ఇకపోతే తాప్సీ నటించిన లేటెస్ట్ మూవీ ఫిర్ ఆయీ హసీనా దిల్రుబా( Phir Aayi Haseen Dilruba ) హసీనా దిల్రుబా కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యింది.ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న తాప్సీ తన ప్రేమ, పెళ్లి, మూవీస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మథియాస్ తనకు ప్రపోజ్ చేసినప్పుడు తనకు అతనిపై ఎన్నో డౌట్లు వచ్చాయని, అతను ప్యూర్ వైట్‌గా ఉంటాదు.మరి నన్నెందుకు ఇష్టపడుతున్నాడని ఆలోచించానని తాప్సీ తెలిపారు.
మథియాస్‌కు డెన్మార్క్, దుబాయ్‌లు మాత్రమే బాగా తెలిసిన ప్రాంతాలు కావడంతో ఫస్ట్ డేట్ కోసం దుబాయ్ కి వెళ్దామని తనతో చెప్పగా నా ఫ్రెండ్స్ భయపెట్టారని, అతను నిన్ను దుబాయ్ లో ఎవరికైనా అమ్మేస్తారని హెచ్చరించారని తెలిపింది.అంతేకాదు నా ఫ్రెండ్ వల్ల సిస్టర్ దుబాయ్ లో సెటిల్ అవ్వడంతో ఆమె ఫోన్ నెంబర్ ను ఇచ్చి ఏదైనా అవసరమైతే తనను కాంటాక్ట్ అవ్వమని చెప్పారని తాప్సీ గుర్తు చేసుకున్నారు.