వీటిని గట్టిగా వాసన పీల్చడం వలన గాఢ నిద్ర వచ్చేస్తుందని తెలుసా?

నిద్ర( Sleep ) అనేది మనిషికి చాలా ముఖ్యం.మరీ ముఖ్యంగా రాత్రి సమయంలో చేసే నిద్ర వలన మనిషి ఆరోగ్యం చాలా బాగుంటుంది.

నిద్ర అనేది మన ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ఒకపూట భోజనం లేకపోయినా పర్వాలేదు కానీ, ఒక రాత్రి నిద్ర లేదంటే.

నెక్స్ట్ డే అంతా చాలా అయోమయానికి గురవుతాము.బేటరీస్ కి ఛార్జ్ ఎలా అవసరమో మన బాడీకి కూడా ఛార్జ్ అనేది అంత అవసరం.

అయితే నేటి దైనందిత జీవితంలో అనేకమంది నిద్రలేమి సమస్యతో బాధ పడుతూ వుంటారు.

Advertisement

నిద్రలేమి సమస్య( Insomnia Problem )లవలన వారు ఎన్నో నిద్రలేని రాత్రులను గడుపుతూ వుంటారు.తద్వారా బీపీ పెరగడం, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.ఎంతమంది డాక్టర్లు దగ్గరికి వెళ్లినా వారి సమస్య తీరనే తీరదు.

అయితే ఎలాంటి నిద్రలేమి సమస్యనైనా ఇట్టే తీర్చేయవచ్చని చెబుతున్నారు మన భారతదేశ ఆయుర్వేద శాస్త్ర నిపుణులు.దానికి మన వంటింట్లోనే పరిస్కారం ఉందని చెబుతున్నారు.అవును, ఈ సమస్య పరిష్కారానికి గసగసాలు( Poppy Seeds ) బాగా సహాయపడతాయి అని మనవాళ్ళు చెబుతున్నారు.

గసగసాలను దోరగా వెగించి ఒక పలుచని వస్త్రంలో వేసి, మూట కట్టి ప్రతి అరగంటకొకసారి పీల్చడం వలన మంచి నిద్ర పడుతుందని అంటున్నారు.అదే విధంగా అరగ్లాస్ పాలల్లో అరస్పూన్ గసగసాలను మరిగించి రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తాగినా కూడా మంచి నిద్ర పడుతుంది.ఇక మన భారతీయుల ప్రతి ఇళ్లల్లో దాదాపుగా గసగసాలు కొలువుదీరి ఉంటాయి.

మసాలా వంటల్లో వీటిని విరివిగా వాడతారు.నిద్రలేమి సమస్య పరిష్కారానికి గసగసాలు ఎంతగానో సహాయపడతాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

మన వంటింటిలో ఉండే చాలా వస్తువులు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయని చాలామందికి తెలియదు.అవును, మన వంటిల్లును ఒక ఔషదాల గని అని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు