తెలంగాణ మహిళలకు మరో శుభవార్త .. త్వరలోనే కొత్త పథకం 

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్( Congress ) ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కొక్క ఆమెని అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు , సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) దూకుడు ప్రదర్శిస్తున్నారు.

 Telangana Congress Government New Scheme For Women Details, Telangana Congress,-TeluguStop.com

ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడం ద్వారా తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ కు మరింత ఆదరణ పెరిగేలా,  వచ్చే ఎన్నికల్లోను మళ్ళీ కాంగ్రెస్ కు తిరుగులేకుండా చేసుకునేందుకు రేవంత్ వ్యూహాలు పన్నుతున్నారు.  అంతేకాకుండా ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తే ఇక తిరుగు ఉడదని లెక్కలు వేసుకుంటున్నారు.

అందుకే ఆర్థిక భారం అయినా నిధులను సమీకరించుకుని మరీ ఒక్కో పథకానికి శ్రీకారం చుడుతున్నారు.

Telugu Congress, Telanganacm, Telangana-Politics

ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు.500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందిస్తున్నారు.  గృహజ్యోతి పథకం( Gruhajyothi Scheme ) కింద కుటుంబానికి 2500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారు .తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఈ పథకాన్ని అందజేస్తున్నారు.తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి ఈ పథకాన్ని అందిస్తున్నారు.

తాజాగా రైతు రుణమాఫీని రెండు లక్షల వరకు మాఫీ చేసి అమలు చేశారు.  ఆగస్టు 15 నాటికి రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేయనున్నారు.

  వీటితో పాటు మిగిలిన హామీల్లో ఒక్కోదాన్ని అమలు చేసే దిశగా రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు.దీనిలో భాగంగానే మహిళలకు ప్రతినెల 2000 రూపాయల సాయం అందిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నారు.

Telugu Congress, Telanganacm, Telangana-Politics

మహాలక్ష్మి పథకం( Mahalaxmi Scheme ) కింద ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉంది.  దీనికోసం అర్హులైన మహిళల జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.  ఈ మేరకు ఎంతమంది మహిళలకు నెలకు ₹2,000 ఇవ్వాలి.దీని కారణంగా ఖజానాపై అదనంగా పడే భారం ఎంత అని లెక్కలు  వేసే పనిలో ఉన్నారు.

వీటితో పాటు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది.అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.అది పూర్తయిన వెంటనే తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో మహిళలందరికీ నెలకు ₹2,000 ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.కాకపోతే వేరే రకమైన పింఛన్ తీసుకుంటున్న వారికి ఈ పథకం వర్తించదు .ఎటువంటి పెన్షన్ తీసుకోకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు నెలకు 2000 రూపాయలు ఇచ్చే పథకానికి త్వరలోనే శ్రీకరం చుట్టనున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube