ఇదెక్కడి చట్టంరా బాబు.. అక్కడ 9 ఏళ్లకే బాలికలు పెళ్లి చేసుకోవచ్చు..

ఇరాక్‌ ( Iraq )దేశంలో బాలికలకు చట్టబద్ధంగా వివాహ వయస్సును తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నారు .ఇరాక్ న్యాయ మంత్రిత్వ శాఖ సమర్పించిన బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత, బాల్య వివాహాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది.

 Where Is The Law Babu Where Girls Can Get Married At The Age Of 9, Viral News, C-TeluguStop.com

అయితే ప్రపంచవ్యాప్తంగా 117 దేశాలు బాల్య వివాహాలను అనుమతిస్తున్నాయని మీకు తెలుసా.? ఇక్కడ వింతేంటంటే.వీటిలో అమెరికా కూడా ఉంది.ఇకపోతే ఏయే దేశాల్లో బాల్యవివాహాలు చట్టబద్ధం అవుతాయని తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, కుటుంబ విషయాలలో నిర్ణయాలు తీసుకోవడానికి పౌరులు మతపరమైన అధికారులు లేదా పౌర న్యాయవ్యవస్థను ఎంచుకోవలసి ఉంటుందని ప్రతిపాదిత బిల్లు పేర్కొంది.ఈ బిల్లు ఆమోదం పొందితే 9 ఏళ్లు నిండిన బాలికలు, 15 ఏళ్లు నిండిన అబ్బాయిలకు పెళ్లిళ్లు జరగడం వల్ల బాల్య వివాహాలు, దోపిడీలు పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం, ఇరాక్‌ లో అమ్మాయిలు, అబ్బాయిల వివాహానికి చట్టబద్ధమైన వయస్సు 18 సంవత్సరాలు.

Telugu America, Chiild, Iraq, Lawbabu-Latest News - Telugu

ఇరాక్‌లో స్వలింగ సంపర్కం, లింగమార్పిడి శస్త్రచికిత్సను( Sex reassignment surgery ) నేరంగా పరిగణించే వ్యభిచార నిరోధక చట్టానికి సవరణలు ప్రతిపాదించిన స్వతంత్ర ఎంపీ రేద్ అల్ మాలికీ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.నివేదిక ప్రకారం, షియా ఇస్లామిస్ట్ పార్టీలు దీనిని పార్లమెంటులో అమలు చేయడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నాయి.1959 నాటి వ్యక్తిగత స్థితి చట్టంలోని 188 చట్టంలో సవరణను తీసుకురాబోతున్నాయి.ఈ చట్టాన్ని గతంలో ఇరాక్‌లోని అబ్దుల్-కరీం ఖాసిం( Abdul-Karim Qasim in Iraq ) ప్రభుత్వం ఆమోదించింది.ఖాసిం వామపక్ష జాతీయవాది.మహిళల హక్కులతో సహా అనేక ప్రగతిశీల సంస్కరణలను అమలు చేయడంలో ప్రసిద్ధి చెందారు.ఈ చట్టం ద్వారా బాలికల వివాహ వయస్సును 18 ఏళ్లకు పెంచారు.

Telugu America, Chiild, Iraq, Lawbabu-Latest News - Telugu

ఇకమారో వైపు అమెరికన్ ప్యూ రీసెర్చ్ సెంటర్( American Pew Research Center ) 2016 విశ్లేషణ ప్రకారం., అమెరికాతో సహా 117 దేశాలు బాల్య వివాహాలను అనుమతిస్తున్నాయి.తల్లిదండ్రుల అనుమతి, న్యాయమూర్తి సమ్మతి లేదా ప్రత్యేక పరిస్థితులలో బాల్య వివాహాలు అనుమతించబడతాయి.అమెరికాలోని చాలా రాష్ట్రాలు వివాహ వయస్సును 16 ఏళ్లకు పెంచాయి.కొన్ని రాష్ట్రాల్లో, అమ్మాయి గర్భవతి కావడం లేదా పెళ్లి చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేయడం వంటి ప్రత్యేక పరిస్థితులలో 16 ఏళ్లలోపు కూడా అనుమతి ఇవ్వబడుతుంది.అంతర్జాతీయ నివేదికల ప్రకారం, బాలికలలో బాల్య వివాహాల రేటు అత్యధికంగా నైజర్‌ లో ఉంది.

ఇక్కడ 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలలో 75 శాతం కంటే ఎక్కువ మంది వివాహం చేసుకున్నారు.వారిలో 30 శాతం మంది 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఉన్నారు.

నైజర్‌ తో పాటు, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, చాద్, మాలిలో కూడా అమ్మాయిల వివాహానికి చట్టబద్ధమైన వయస్సు 13 సంవత్సరాలు, అబ్బాయిలకు 18 సంవత్సరాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube