బ్రెజిల్‌లో( Brazil ) ఘోర విమాన ప్రమాదం జరిగింది.62 మందితో ప్రయాణిస్తున్న విమానం శుక్రవారం కూలిపోయిందని స్థానిక మీడియా నివేదించింది.ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 62 మంది మరణించినట్లు సమాచారం.శుక్రవారం బ్రెజిల్ లోని సావో పాలో సమీపంలో 62 మందితో ప్రయాణిస్తున్న ప్రాంతీయ టర్బోప్రాప్ విమానం( Turboprop aircraft ) కూలిపోయిందని, అందులో ఉన్న వారంతా మరణించారని క్రాష్ సైట్ సమీపంలోని స్థానిక అధికారులు తెలిపారు.
విన్ హెడ్డో సమీపంలోని వాలిన్‌హోస్ పట్టణంలో ( Valinhos )విమానంలో ఉన్న వాళ్లలో ఒక్కరు కూడా ప్రాణాలతో లేరని అధికారులు వెల్లడించారు.అలాగే స్థానిక నివాస సముదాయంలోని ఇల్లు దెబ్బతిన్నదని చెప్పారు.అయితే ఇంట్లో ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు.ఎయిర్ లైన్ వోపాస్ లిన్హాస్ ఏరియాస్ ( Airline Vopass Linhas Areas )నిర్వహిస్తున్న ATR-72 విమానం పరానా రాష్ట్రంలోని కాస్కావెల్ నుండి సావో పాలోలోని గౌరుల్ హోస్ కు వెళుతోంది.
సావో పాలో రాష్ట్ర అగ్నిమాపక దళం విన్హెడావోలో ఒక విమానం కూలిపోయిందని సోషల్ మీడియాలో ధృవీకరించింది.
ప్రమాదానికి ముందు ట్రాకింగ్ ప్రకారం.విమానం గాలిలో 4,100 అడుగుల ఎత్తులో ప్రయాణం చేస్తోంది.ఇక ఆ ఘటన చుసిన ప్రత్యక్ష సాక్ష్యులు ఈ ప్రమాదాన్ని తలుచుకుని భయబ్రాంతులకు లోనయ్యారు.
ఈ ఘటనలో మరి కొంచెం పెను ప్రమాదం తప్పిందని, లేకపోతే విమానం నేరుగా వారి ఇళ్లపై పడిపోయేదని చెప్పుకొచ్చారు.ఘటన అనంతరం శబ్దం వినగానే అందరికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్టుగా అనిపించిందని వాపోతున్నారు.
ఘటన ప్రమాదం తెలుసుకొని చాలా మంది బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు.ఇళ్ల వెనకాల పొదల్లో విమానం పడిపోవడాన్ని చూసి అక్కడి వారు భయానికి లోనయ్యారు.