అజీర్తికి దూరంగా ఉండాల‌నుకుంటే ఈ ఆహారాలు మీ డైట్‌లో ఉండాల్సిందే!

జీర్ణ వ్యవస్థకు సంబంధించి సాధారణంగా ఎదుర్కొనే సమస్యలు కొన్ని ఉన్నాయి.అందులో అజీర్తి ఒక‌టి.

 These Foods Should Be In Your Diet To Avoid Indigestion , Indigestion, Best Food-TeluguStop.com

కోట్లాది మందిని చాలా కామ‌న్‌గా ప‌ట్టి పీడించే స‌మ‌స్య ఇది.అతిగా ఆహారం తీసుకోవ‌డం, ఆహారాన్ని పూర్తిగా నమలకుండా తిన‌డం, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్ని త‌ర‌చూ లాగించేయ‌డం, ఆకలి వేసినా వేయకపోయినా ఏదో ఒకటి తినేయ‌డం, తిన్న ఆహారం అర‌గ‌కుండానే మ‌ళ్లీ ఆహారం తీసుకోవ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మందగిస్తుంది.దాని మూలంగా అజీర్తి స‌మ‌స్య త‌లెత్తుంది.ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు ఏ ఆహారం తినాల‌న్నా తెగ భ‌య‌ప‌డుతుంటారు.ఈ క్ర‌మంలోనే అజీర్తిని వ‌దిలించుకోవ‌డం కోసం హాస్ప‌ట‌ల్స్ చుట్టూ తిరుగుతూ ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.అయితే జీర్ణ వ్య‌వ‌స్థను చురుగ్గా మార్చి అజీర్తిని దూరం చేయ‌డంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

ఫ్లెక్స్ సీడ్స్‌.

వీటినే అవిసె గింజ‌లు అని అంటారు.జీర్ణ వ్య‌వ‌స్థకు ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు.

ప్ర‌తి రోజు వ‌న్ టేబుల్ స్పూన్ అవిసె గింజ‌ల‌ను ఏదో ఒక రూపంలో తీసుకుంటే అజీర్తి మాత్ర‌మే కాదు గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి జీర్ణ స‌మ‌స్య‌లేమి త‌లెత్త‌కుండా ఉంటాయి.జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరును మెరుగుప‌రిచి అజీర్తికి చెక్ పెట్ట‌డంలో బొప్పాయి గ్రేట్ గా స‌హాయ‌ప‌డుతుంది.

వారంలో క‌నీసం మూడు, నాలుగు సార్లు అయినా బొప్పాయి పండును తింటే అజీర్తి స‌మ‌స్య‌కు దూరంగా ఉండొచ్చు.

Telugu Foods, Tips, Latest-Telugu Health Tips

పొట్ట‌ను శుభ్రం చేసి జీర్ణ వ్య‌వ‌స్థ చురుకుదనాన్ని పెంచ‌డంలో కివి పండు ఉప‌యోగ‌ప‌డుతుంది.ఎవ‌రైతే అజీర్తికి దూరంగా ఉండాల‌నుకుంటున్నారో.వారు త‌ప్ప‌కుండా త‌మ డైట్ లో కివి పండును చేర్చుకోండి.

ఇక‌ డ్రై ఫ్రూట్స్‌, బ్రోక‌లీ, బీన్స్‌, యాపిల్ వంటి ఆహారాలు సైతం అజీర్తి స‌మ‌స్య ద‌రి చేర‌కుండా అడ్డుకోగ‌ల‌వు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube