చాలామంది నిద్ర లేవగానే ఎంతో నీరసంగా కనిపిస్తారు.అలాగే ఏ పని కూడా చేయలేక పోతారు.
అసలు కొంతమందికి అయితే ఉదయాన్నే నిద్ర లేచే అలవాటే ఉండదు.దీంతో ఎన్నో అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు.
అయితే ఉదయాన్నే ఏడు గంటల లోపే లేచి ఈ పనులు చేస్తే మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.అయితే నిద్ర లేవగానే( Wake Up ) ముందుగా నీరు తాగడం చాలా మంచిది.
దీని ద్వారా రోజంతా ఎంతో ఉల్లాసంగా ఉంటారు.ఇక లేవగానే ఫోన్, సిస్టం, టీవీ చూసే అలవాటు ఉంటే వెంటనే ఈ అలవాటులను మార్చుకోవాలి.
వీటి వలన చాలా నష్టాలు వస్తాయి.దీని వలన మీరు ఏ పని కూడా చేయలేక పోతారు.

ఆఫీస్ కి వెళ్ళాలి అన్న కూడా మీరు నీరసపడిపోతారు.ఇక ప్రతిరోజు 20 నిమిషాల పాటు వ్యాయామం( Exercise ) చేయాలి.ఇలా చేయడం వలన మీ శరీరం చాలా బలంగా ఉంటుంది.అలాగే రోజంతా యాక్టివ్ గా కూడా ఉండగలుగుతారు.ఇక ప్రతిరోజు 10 నిమిషాలు ధ్యానం( Meditation ) చేయడం చాలా మంచిది.ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
దీంతో మీరు మానసికంగా ఆరోగ్యంగా అలాగే శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు.ఇక ఆ తర్వాత మీ ఇష్ట దైవాన్ని పూజించడం లేదా ప్రార్థన చేసుకోవడం లేదా పుస్తకం చదవడం లాంటి మంచి పనులతో మీ రోజును ప్రారంభించాలి.

ఇలా చేయడం వలన మీ రోజు మొత్తం ఆనందంగా గడిచిపోతుంది.అలా కాకుండా సమయం దాటి నిద్ర లేవడం వలన రోజంతా చాలా చెడుగా సాగుతుంది.మీరు చేయబోయే పనులను ముందే ప్లాన్ చేసుకోవాలి.దీని వలన ఎలాంటి టెన్షన్ లేకుండా మీ పనులు వెంటనే జరిగిపోతాయి.ఇక చాలామంది తిన్న తర్వాత స్నానం( Bathing ) చేస్తారు.అలా చేయడం వలన జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
కాబట్టి తినడానికి ముందు స్నానం చేయాలి.ఆ తర్వాతే తినాలి.
ఇవన్నీ మీ జీవితంలో మీరు ప్రతిరోజు పాటించడం వలన ఎలాంటి ఉన్నత స్థాయికి అయినా చేరుకోగలరు.