అమెరికాలోని వెస్ట్ వర్జీనియా ( West Virginia in the US )రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి ఎవరూ ఊహించని విధంగా ఓ రికార్డు క్రియేట్ చేశాడు.తన మూడేళ్ల కూతురి కోసం కొన్న పింక్ కలర్ ఫిష్ రాడ్‌తో( pink colored fish rod ) అతను వరల్డ్ రికార్డు బద్దలు కొట్టాడు.ఈ రాడ్ ధర కేవలం 10 డాలర్లు మాత్రమే (సుమారు రూ.800).ఆ తండ్రి పేరు జాన్ టైలర్ రుథర్‌ఫర్డ్( John Tyler Rutherford ).వెస్ట్ వర్జీనియాలోని వేన్ కౌంటీకి చెందిన ఈయన ఓ చేప పట్టుకున్నాడు.అది ఒక క్యాట్ ఫిష్.ఈ చేప 43.51 అంగుళాల పొడవు, 46.70 పౌండ్ల బరువు ఉంది.ఇది ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు పట్టుకున్న చేపల రికార్డును బద్దలు కొట్టింది.ఆశ్చర్యకరంగా, ఈ భారీ చేపను అతను తన తండ్రి ఫామ్‌హౌస్‌లోని చెరువులో పట్టుకున్నాడు.
వెస్ట్ వర్జీనియా ప్రభుత్వం ఈ రికార్డును అధికారికంగా ధ్రువీకరించింది.జాన్ తన కూతురి పింక్ కలర్ ఫిష్ రాడ్‌తో ఈ రికార్డు బద్దలు కొట్టాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.తన కూతురు చేపలను రోల్ చేస్తుందని కానీ ఎర విసిరేయలేకపోతుందని, అందుకే తాను రాడ్ విసిరి, చేపను పట్టుకున్నట్లు జాన్ చెప్పాడు.వారు చేపలు పట్టుకోవడానికి వెళ్లినప్పుడు, ఇంత పెద్ద చేప దొరుకుతుందని అనుకోలేదు.
సాధారణంగా చేపలు 22 అంగుళాల పొడవు ఉంటాయి.కానీ జాన్ టైలర్ పట్టుకున్న చేప 43.51 అంగుళాల పొడవు ఉంది.అతని ఈ రికార్డు అమెరికా అంతటా చర్చనీయాంశమైంది.
వెస్ట్ వర్జీనియా రాష్ట్రంలోని చేపల వేట ఎంతో ప్రసిద్ధి చెందిందని రాష్ట్ర గవర్నర్ జిమ్ జస్టిస్ ( Governor Jim Justice )చెప్పారు.ఈ రాష్ట్రంలో చేపల వేటకు ఎంతో మంచి అవకాశాలున్నాయి.
ఇక్కడికి దూర ప్రాంతాల నుండి చేపలు పట్టడానికి వచ్చేవారు ఎక్కువ.ఇప్పుడు జాన్ టైలర్ పట్టుకున్న చేప ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తోంది.
ఇంతకుముందు కూడా ఈ రాష్ట్రంలోని ఇతర చేపల రకాలకు కూడా కొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి.ఉదాహరణకు, టైగర్ ట్రౌట్, రెడ్‌బ్రెస్ట్ సన్‌ఫిష్, బౌఫిన్, బ్లాక్ క్రాపీ వంటి చేపలకు కొత్త రికార్డులు వచ్చాయి.