న్యాచురల్ స్టార్ నాని( Nani ) కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.నాని నటించిన సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram ) మూవీ మరో 19 రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.
నాని సరిపోదా శనివారం సినిమాకు 106 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది.ఈ సినిమాకు 95 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు అయిందని భోగట్టా.
మిడిల్ రేంజ్ హీరోలలో ఈ హీరోనే నంబర్ వన్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.100 కోట్ల రూపాయలకు పైగా ఒక మిడిల్ రేంజ్ హీరో సినిమాకు బిజినెస్ జరగడం సాధారణమైన విషయం కాదు.ఈ సినిమాలో ఎస్జే సూర్య విలన్ గా నటిస్తుండగా ఎస్జే సూర్య( SJ Surya ) ఈ సినిమా కోసం 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం అందుకున్నారని వార్తలు వినిపించాయి.సరిపోదా శనివారం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.
న్యాచురల్ స్టార్ నాని భవిష్యత్తు సినిమాలు సైతం భారీ హిట్లుగా నిలిస్తే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.భిన్నమైన కథలను ఎంచుకోవడం నాని సక్సెస్ కు కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి.న్యాచురల్ స్టార్ నాని త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.న్యాచురల్ స్టార్ నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
సరిపోదా శనివారం సినిమాలో ప్రియాంక మోహన్( Priyanka Mohan ) హీరోయిన్ గా నటిస్తున్నారు.ప్రియాంక మోహన్ కు ఈ సినిమా సక్సెస్ ఎంతో కీలకమని చెప్పాల్సిన అవసరం లేదు.సరిపోదా శనివారం బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని చెప్పడంలో సందేహం అవసరం లేదు.నాని రెమ్యునరేషన్ 30 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది.
నాని స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు.