మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.అందులో అందరూ హీరోలు తప్ప హీరోయిన్లు ఎవరు లేరు.
అయితే మెగా ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీకి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఎంట్రీ ఇవ్వగా వారిలో సక్సెస్ అయిన వాళ్లు ఇంకా లేరనే చెప్పాలి.సుష్మిత తన తండ్రి చిరంజీవి( Chiranjeevi ) కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ విజయవంతంగా నడిపిస్తున్నప్పటికీ నిర్మాతగా కార్డు వేసుకుని నాన్నతో సినిమా తీయాలనే లక్ష్యంతో ఉంది.
భోళా శంకర్ ఫ్లాప్ కాకపోయి ఉంటే కళ్యాణ్ కృష్ణతో ప్రాజెక్టు తెరకెక్కేది కానీ తర్వాత నిర్ణయం మారిపోయింది.
అలాని ప్రొడ్యూసర్ గా ప్రయత్నాలు ఆపలేదు.చిన్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు తీస్తూ నిర్మాణం కొనసాగిస్తోంది.ఇటీవలే పరువుకి మంచి ఫీడ్ బ్యాకే వచ్చింది.
కావాల్సిందల్లా బిగ్ స్క్రీన్ నుంచి బిగ్ బ్రేక్.ఇక నీహారిక కొణిదెలకు( Niharika Konidela ) వ్యక్తిగత జీవితంలో కొంత ఇబ్బంది వచ్చాక దాని నుంచి కోలుకుని నిర్మాతగా కమిటీ కుర్రోళ్ళుతో( Committee Kurrollu ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే తాజాగా విడుదల అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది.ప్రస్తుతం ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
అలాగే బుక్ మై షోలో రెండు కూడా రోజులుగా ట్రెండింగ్ లో ఉంది.సగటున గంటకు పదిహేను వందల నుంచి రెండు వేల దాకా ఆన్ లైన్ టికెట్లు అమ్ముడుపోతున్నాయి.
కౌంటర్ సేల్స్ కలుపుకుంటే మంచి నెంబర్స్ నమోదు కావడం ఖాయమే.
ఈ ఆనందం సక్సెస్ మీట్ సందర్భంగా నిహారిక కళ్ళలో కనిపిస్తోంది.వెబ్ సిరీస్ లు ఎన్ని హిట్ అయినా సినిమా క్లిక్ అయితే వచ్చే కిక్ వేరుగా ఉంటుందని చెప్పవచ్చు.మొదటి సినిమాతోనే మంచి బోణి కొట్టింది నిహారిక.
ప్రొడ్యూసర్ గా( Producer ) తెలుసా మొదటి సినిమా హిట్ కావడంతో మెగా అభిమానులు కూడా సంతోషిస్తున్నారు.ఈ సందర్భంగా నిహారిక కు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇకపై కూడా మంచి కథలతో సినిమాలు తీయడం కొనసాగిస్తానని చెబుతున్న నీహారిక కమిటీ కుర్రోళ్ళు రెండో వారంలోనూ దూకుడు కొనసాగిస్తుందనే ఆశాభావంతో ఉంది.ఆగస్ట్ 15న పెద్ద సినిమాల పోటీ విపరీతంగా ఉన్న నేపథ్యంలో థియేటర్లను అట్టిపెట్టుకోవడం అంత సులభం కాదు.
పైగా స్క్రీన్లు తక్కువ ఉండే బిసి సెంటర్లలో ఎగ్బిటర్లు సర్దుబాటు చేయలేరు.ఏదైతేనేం సక్సెస్ టార్గెట్ పెట్టుకున్న నీహారికకు అది దక్కేసినట్టే అని చెప్పాలి.
ఈ సినిమా తప్పకుండా కలెక్షన్లు కురిపిస్తే స్టార్ ప్రొడ్యూసర్ కావడం పక్క అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.