ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా అక్కినేని నాగచైతన్య, శోభితల( Naga Chaitanya , Sobhita Dhulipal) ఎంగేజ్మెంట్ వేడుక గురించి మాట్లాడుకుంటున్నారు.అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోషల్ ఎప్పటినుంచో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలును నిజం చేస్తూ ఒక్క పోస్ట్ కూడా చేయకుండా ఒక్కసారిగా ఎంగేజ్మెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సామాన్యతో పాటు సెలబ్రిటీలు కూడా షాక్ కు గురయ్యారు.కొంతమంది అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతుండగా మరి కొందరు ఈ విషయంలో సమంతని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు.
కాగా శోభిత ధూళిపాల నాగచైతన్య రెండు రోజుల క్రితం అక్కినేని నాగార్జున( Nagarjuna Akkineni ) చేసుకున్న విషయం తెలిసిందే.ఆ సంగతి అటు ఉంచితే ఇప్పుడు తాజాగా ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదేమిటంటే.శోభిత ధూళిపాళకు ఒక చెల్లి ఉంది.ఆ చెల్లి పేరు కూడా సమంతనే అని తెలియడంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.శోభిత చెల్లి సమంత( Samantha ) డాక్టర్ గా పనిచేస్తుంది.
ఆల్రెడీ ఆమెకు పెళ్లి అయింది.తాజాగా నాగచైతన్య శోభిత నిశ్చితార్థం ఫొటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆసక్తికర విషయం తెలిపింది.
సమంత ధూళిపాళ నిశ్చితార్థం ఫొటోలు పోస్ట్ చేసి 2022 నుంచి ఎప్పటికి.అని పోస్ట్ చేసింది.దీంతో వీళ్ళిద్దరూ 2022 నుంచి లవ్ లో ఉన్నారు అని డైరెక్ట్ గానే చెప్పేసింది.ఈ విషయం తెలిసి ఇప్పుడు ఫ్యాన్స్, నెటిజన్లు షాక్ అవుతున్నారు.నాగ చైతన్య సమంత 2021లో విడాకులు తీసుకున్నారు.2022 నుంచి చైతన్య – శోభిత లవ్ లో ఉన్నారు అని శోభిత చెల్లి సమంత చెప్పడం, నాగ చైతన్య మాజీ భార్య పేరు సమంత, శోభిత చెల్లి పేరు కూడా సమంత అవ్వడంతో ఈ వార్త వైరల్ గా మారింది.సమంత కూడా అచ్చం శోభిత లాగే ఉంది.