తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడంలో వెంకటేష్( Venkatesh ) చాలా ముందు వరుసలో ఉన్నాడు.ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తూనే వేణు ఉడుగుల( Venu Udugula ) డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇక ఇదిలా ఉంటే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరించడమే కాకుండా తనను తాను మరొకసారి విక్టరీ వెంకటేష్ గా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.ఇప్పుడు ఆయన చేయబోయే సినిమాలు కూడా కామెడీ జానర్ లో తెరకెక్కుతుండటం విశేషం…
ఇక ఇంతకుముందు అన్ని రకాల సినిమాలను చేసిన వెంకటేష్ ఇప్పుడు మాత్రం యాక్షన్ ఎంటర్ టైనర్ల మీదకే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే కామెడీ యాక్షన్ డైరెక్టర్గ గా గుర్తింపు పొందిన అనిల్ రావిపూడి( Anil Ravipudi ) డైరెక్షన్ లో చేస్తున్న సినిమా మీద ఆయన భారీ అంచనాలను పెట్టుకున్నాడు.ఇక మొత్తానికైతే తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నాడు.
అయితే వేణు ఉడుగుల డైరెక్షన్ లో చేయబోయే సినిమాలో వెంకటేష్ ఆర్మీ బ్యాక్ డ్రాప్( Army Backdrop ) కథలో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది.
ఇక అందులో ఆయన ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలో ఆయన ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తే మాత్రం ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్ అవుతుందనే చెప్పాలి.ఇక ఇప్పటివరకు వెంకటేష్ అలాంటి పాత్రను పోషించడం చాలా తక్కువ.
కాబట్టి ఇప్పుడు ఈ సినిమాని కనక చేయగలిగితే ఆయన పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు… ఇక వెంకటేష్ ఇంతకుముందు చేసిన సినిమాలు ఒక లెక్క ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొక లెక్క అనేలా ముందుకు వెళ్తున్నాడు…
.