2024 పారిస్ ఒలింపిక్స్( Paris Olympics ) పోటీలు నిన్నటితో ముగిసాయి.ఈ అంతర్జాతీయ క్రీడా పోటీలు జులై 24న ప్రారంభమై ఆగస్టు 11న క్లోజ్ అయ్యాయి.10,500 మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.కానీ, ఈ ఒలింపిక్స్‌లో అందరి నోళ్లలో ఓ పేరు బాగా వినిపిస్తోంది ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉంటుంది చాలా సెక్సీగా కూడా కనిపిస్తుంది.
ఆ అందాల క్రీడాకారిణి పేరు అలికా ష్మిత్( Alika Schmidt ).ఈసారి ఒలింపిక్స్‌లో పోటీ చేసిన అత్యంత అందమైన అమ్మాయిగా ఆమె పేరు తెచ్చుకుంది.
జర్మనీ( Germany ) దేశానికి చెందిన అలికా ష్మిత్ ఒక ప్రముఖ రన్నర్.ఆమె పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 4 x 400 మీటర్ల రిలే పోటీలో పాల్గొంది.కానీ, ఈ పోటీలో ఏడవ స్థానానికి పరిమితమైంది.దీంతో ఈ ఒలింపిక్స్‌లో ఆమె పోటీలు ముగిశాయి.అయితే, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న మహిళా క్రీడాకారిణుల్లో ఆమె ఒకరు.ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 5 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
జర్మన్ స్ప్రింటర్ జీన్ పాల్ బ్రెడా,( Jean Paul Breda ) పారిస్ ఒలింపిక్స్‌లో 4×400 మీటర్ల మిక్స్డ్ రిలే జట్టులో తన ప్రేయసి లూనా బుల్మాన్కు బదులు అలికాను ఎంపిక చేసిన సెలెక్టర్లను ప్రశ్నించాడు.తన వ్యాఖ్యలకు బ్రెడా తర్వాత క్షమాపణ చెప్పినా, బుల్మాన్ మాత్రం సోషల్ మీడియాలో తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.దీంతో మహిళల రిలే పోటీ జరగకముందే ఆమెను జట్టు నుంచి తొలగించారు.బుల్మాన్ను జట్టు నుంచి తొలగించడం గురించి అడిగినప్పుడు అలికా, “ఈ నిర్ణయం మాది కాదు, జట్టు నాయకులు, కోచ్‌లు తీసుకున్నారు.
జట్టుకు ఇదే బెస్ట్ ఛాయిస్ అయి ఉంటుంది.మేము మా కోచ్‌లను నమ్ముతాము” అని చెప్పింది.