ఆ సీన్లు చేయడానికి ఇంట్లో వాళ్ల పర్మిషన్ తీసుకున్న ప్రభాస్, మహేష్..?

సాధారణంగా చాలా మంది సినిమా యాక్టర్లు తమ ఫ్యామిలీకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు.కొందరైతే వారి పేరెంట్స్ అనుమతి తీసుకున్న తర్వాతే మూవీ ఇండస్ట్రీలో అడుగు పెడతారు.

 Heros Who Taken Permission To Act In Such Scenes ,namrata Shirodkar, Prabhas, M-TeluguStop.com

ఒకవేళ వారి ఇష్టంతోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా వారికి నచ్చని ఏ సన్నివేశం కూడా చేయడానికి సాహసించరు.అలాంటి వాళ్లలో కొందరు కొన్ని సీన్లు చేయడానికి ఇంట్లో (లైఫ్ పార్ట్‌నర్‌తో సహా) వాళ్ల పర్మిషన్ తీసుకున్నారు.

వీరిలో బాహుబలి హీరో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఉన్నాడు.ఇంకా ఇంట్లో వాళ్ల పర్మిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరో తెలుసుకుందాం.

ప్రభాస్ – అడవి రాముడు కిస్ సీన్

Telugu Adavi Ramudu, Businessman, Fidaa, Mahesh Babu, Prabhas, Sai Pallavi-Movie

2004లో విడుదలైన రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ “అడవి రాముడు( Adavi Ramudu)” భారీ అంచనాల నడుమ విడుదల అయింది.బ్లాక్ బస్టర్ హిట్ “వర్షం” తర్వాత ఇది రిలీజ్‌ అయింది కాబట్టి దీనిపై హై రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకున్నారు.అయితే ఆ అంచనాలు రీచ్ కాలేక మూవీ ఫ్లాప్‌ అయింది.దీనిని బి.గోపాల్ డైరెక్ట్ చేశాడు.ఇందులో ప్రభాస్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించారు.

గిరిజన యువకుడికి, అతని చిన్ననాటి ప్రియురాలికి మధ్య జరిగే ప్రేమకథ చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది.

అయితే స్క్రిప్ట్‌లో భాగంగా ప్రభాస్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్‌ను కిస్ పెట్టుకోవాల్సి వచ్చింది.

ఆర్తిని ముద్దు పెట్టుకోవాలి అని డైరెక్టర్ చెప్పగానే ప్రభాస్ చాలా భయపడి పోయాడు.తర్వాత తన తండ్రి ఉప్పలపాటి సూర్య నారాయణ రాజుకు ఫోన్ చేసి ఆ సీన్ చేయనా వద్దా నాన్న అని అడిగాడట.

అయితే “సినిమానే కదా, ఏం కాదు చేసేయ్” అని తండ్రి రిప్లై ఇచ్చాడట.అలా పర్మిషన్ ఇచ్చాక ప్రభాస్ ఈ సన్నివేశాన్ని చేశాడు.

సాయి పల్లవి – ఫిదా షార్ట్ డ్రెస్

Telugu Adavi Ramudu, Businessman, Fidaa, Mahesh Babu, Prabhas, Sai Pallavi-Movie

సాయి పల్లవి “ఫిదా (2017)( Fidaa )” సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసింది.ఈ సినిమా మొత్తంలో సాయి పల్లవి పల్లెటూరి అమ్మాయిలాగా కనిపిస్తుంది.కానీ ఒక సీన్‌లో మాత్రం మోడర్న్ గెటప్‌లో మెరుస్తుంది.సన్నివేశం డిమాండ్ చేయడం, దర్శకుడు శేఖర్ కమ్ముల పట్టుబట్టడంతో ఆమె బ్లాక్ స్లీవ్‌లెస్ గౌను ధరించాల్సి వచ్చింది.

అయితే ఈ సన్నివేశం చేయాల్సి వచ్చినప్పుడు ఆమె తన తల్లికి ఫోన్ చేయగా తల్లి ఓకే చెప్పింది.దాంతో ఈ ముద్దుగుమ్మ ఆ డ్రెస్ వేసుకుంది.సాధారణంగా సాయి పల్లవి ఇతర హీరోయిన్ల వలె డైరెక్టర్లు చెప్పినట్టు స్కిన్ ఎక్స్‌పోజ్ చేసే ఔట్‌ఫిట్ అస్సలు ధరించదు.తనకు నచ్చిన బట్టలు మాత్రమే వేసుకుంటుంది.

బిజినెస్‌మేన్

ప్రిన్స్ మహేష్ బాబు పెళ్లి అయ్యాక తన కెరీర్‌లో హాట్ రొమాంటిక్ సీన్లకు దూరంగా ఉంటూ వచ్చాడు.హీరోయిన్లతో లిప్‌-లాక్ సన్నివేశాలు కూడా చేయలేదు.

కానీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బిజినెస్‌మేన్‌( Businessman)లో మొదటిసారి లిప్ లాక్ సీన్ చేశాడు.ఈ సన్నివేశం చేయడానికి మహేష్ బాబు, పూరి ఇద్దరూ నమ్రతా శిరోద్కర్( Namrata Shirodkar) నుంచి పర్మిషన్ తీసుకున్నారట.నమ్రత సినిమా చూసి ఎంజాయ్ చేసిందని అప్పట్లో పూరి చెప్పాడు.“సందమామ నవ్వే సందమామ.మంచు బొమ్మా నీ మనసే ఇచ్చుకొమ్మ” అంటూ సాగే పాటలో మహేష్ కాజల్‌ను చాలా ప్యాషనేట్‌గా లిప్ కిస్ పెట్టుకుంటాడు.ఇప్పటికీ ఈ లిప్ లాక్ చర్చనీయాంశమే!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube