శ్రీదేవిని ఎత్తుకున్న నిర్మాత రామానాయుడు.. ఎందుకో తెలిస్తే..?

1982లో విడుదలైన “దేవత” సినిమా( Devata ) సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నటభూషణ శోభన్ బాబు, అతిలోక సుందరి శ్రీదేవి, జయప్రద, మోహన్ బాబు నటించారు.

 Why Ramanaidu Lifted Sridevi , Daggubati Ramanaidu, Sridevi , Elluvochi Godara-TeluguStop.com

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి.రామా నాయుడు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

ఈ చిత్రంలో ఇద్దరు సిస్టర్స్, ఒకే వ్యక్తితో ట్రయాంగిల్ లవ్ అఫైర్ నడిపిస్తారు.అయితే ఈ మూవీలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల పాడిన “ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిలా పడ్డాదమ్మో( Elluvochi Godaramma)” పాట సూపర్ హిట్ అయింది.ఈ పాటను శోభన్ బాబు, శ్రీదేవి లపై తీశారు, ఇందులో వందల సంఖ్యలో బిందెలు పెట్టి వాటి మధ్యలో శ్రీదేవి, శోభన్ బాబు డ్యాన్స్ చేస్తుంటారు.

శ్రీదేవి నీటి బిందెలపై చాలా నాజూగ్గా నడుస్తూ కూడా కనిపిస్తుంది.రాజమండ్రిలోని గోదావరి నది ఒడ్డున ఈ పాట షూట్ చేశారు.అయితే ఈ లొకేషన్‌కి వెళ్లడానికి సినీ బృందం రోజూ బోట్ లో వెళ్లేవారు.

Telugu Devata, Sobhan Babu, Sridevi, Tollywood-Movie

అయితే బోట్ దిగిన తర్వాత షూటింగ్ లోకేషన్ కి చేరుకోవడానికి కొంచెం దూరం బురదలో నడవాల్సి వచ్చేది.అయితే అలా నడుచుకుంటూ వెళ్తే శ్రీదేవి కాస్ట్యూమ్స్ కి బురద అంటుకుంటుందని నిర్మాత రామానాయుడు భయపడేవారు.అందుకే ఆమెను తానే ఎత్తుకొని షూటింగ్ లోకేషన్ కి తీసుకొచ్చేవారు.

అప్పట్లో శ్రీదేవిని రామానాయుడు తన చేతులతో షూటింగ్ లోకేషన్ కు మోసుకెళ్లారనే విషయం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది./br>

Telugu Devata, Sobhan Babu, Sridevi, Tollywood-Movie

ఈ పాటలో శ్రీదేవి, శోభన్ బాబు( Sobhan Babu ) అద్భుతంగా డ్యాన్స్ చేశారు.ఇప్పటికీ దీన్ని వినేవారు ఉన్నారు.ఇది ఒక ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ అని చెప్పుకోవచ్చు.

ఈ పాటను కే చక్రవర్తి కంపోజ్ చేశారు.“ఎల్లువొచ్చి గోదారమ్మ” పాటను మెగా టవర్ స్టార్ వరుణ్ తేజ్‌ హీరోగా నటించిన గద్దలకొండ గణేష్ సినిమాలో “ఎల్లువొచ్చి గోదారమ్మ”గా రీమిక్స్ చేశారు.

ఆ పాటు కూడా సూపర్ హిట్ అయింది.డాక్టర్ డి.రామానాయుడు( Daggubati ramanaidu ) సినిమా పరిశ్రమకు విశేషమైన సేవలు అందించారు.రామానాయుడు 150 కంటే ఎక్కువ చిత్రాలతో అత్యధిక చిత్రాలను నిర్మించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కూడా సంపాదించారు.

రాముడు భీముడు, ప్రేమ్‌నగర్, సోగ్గాడు, అహనా పెళ్ళంట, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్‌!, ప్రేమించుకుందాం రా వంటి ఎన్నో హిట్ సినిమాలు రామానాయుడు నిర్మాణంలో తెరాకెక్కాయి.ఈ సినిమాల ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హై రేంజ్ లో ఉండేవి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube