కరాచీలోని కోరంగి స్మశానవాటికలో( Korangi Cemetery ) ఒక భయంకరమైన సంఘటన జరిగింది.ఆగస్టు 9వ తేదీ శుక్రవారం, 40 ఏళ్ల ఒక వ్యక్తి స్మశానవాటికలోని మహిళల సమాధులను తవ్వి, వారి మృతదేహాలపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు.
ఆ అసభ్యకరమైన పనులు చేశానని ఒప్పుకున్నాడు కూడా పోలీసులు అతడిని ఇప్పుడు అరెస్టు చేశారు.ఇలాంటి చర్యను నెక్రోఫిలియా( Necrophilia ) అని అంటారు.
ఈ వ్యక్తి నలుగురు మహిళల మృతదేహాలపై లైంగిక కోరికలను తీర్చుకున్నాడు.కొద్దిరోజుల క్రితం మరణించిన 55 ఏళ్ల మహిళ సమాధిని తవ్వుతుండగా స్థానిక నివాసితులు అతన్ని పట్టుకుని కొట్టారు, ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.
క్రైమ్ రిపోర్టర్ తహీర్ అబ్బాస్ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ ఆ వ్యక్తి పేరు సల్మాన్ వహీద్( Salman Waheed ) అని తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ 40 ఏళ్ల నీచుడు నలుగురు మహిళల సమాధులను తవ్వి ఆ మృతదేహాలతో శృంగారం చేసినట్లు ఒప్పుకున్నాడు.
తాజాగా పాతిపెట్టిన మహిళలను లక్ష్యంగా చేసుకుని, ఆ మృతదేహాలను త్వరగా వెలికితీసి, వాటిపై ఇతను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.ఇలాంటి వ్యక్తులను చూస్తుంటే ఆఖరికి చనిపోయిన తర్వాత కూడా ఆడవాళ్లకు కామాంధుల నుంచి రక్షణ లేకుండా పోయిందని అర్థమవుతుంది.
మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అవామీ కాలనీ పోలీసులు నిందితుడిపై సెక్షన్ 297 (శ్మశాన వాటికపైకి చొరబడటం మొదలైనవి), 376 (అత్యాచారానికి శిక్ష), 354 (దాడి లేదా నేరపూరిత శిక్ష) కింద కేసు నమోదు చేశారు.ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఫిర్యాదు ప్రకారం, గురువారం సాయంత్రం ఓ వ్యక్తి తన తల్లిని శ్మశానవాటికలో పాతిపెట్టాడు.అనంతరం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో నిందితుడు సమాధిని తవ్వి మృతదేహాన్ని వేధించారని తెలుసుకున్నాడు.కొందరు స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకుని కొట్టి, ఆపై పోలీసులకు అప్పగించారు.
నిందితుడు ఎమర్జెన్సీ లైట్‌ను ఉపయోగించి నేరానికి పాల్పడ్డాడని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఎనిమిదేళ్ల క్రితం కోరంగిలోని ఓ శ్మశాన వాటికలో ఇలాంటి నేరాలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేశారు.2016లో కోరంగి నంబర్ 01 శ్మశాన వాటికలో స్థానికులు పట్టుకున్నారు.ఇక తాజాగా పట్టుబడిన నిందితుడిని వైద్య పరీక్షల కోసం జిన్నా పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లారు.
పోస్ట్‌మార్టం కోసం బాధితురాలి మృతదేహాన్ని కూడా వెలికితీశారు.పోలీసుల పర్యవేక్షణలో మహిళ కొడుకు నుండి డీఎన్ఏ నమూనాలను సేకరించారు.
ఆ తర్వాత కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని తిరిగి మళ్లీ పూడ్చిపెట్టారు.