మహేష్ బాబు( Mahesh Babu) హీరోగా కృష్ణవంశీ( Krishna Vamsi) దర్శకత్వంలో వచ్చిన మురారి సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.అయితే ఈ సినిమాని మొదట కృష్ణవంశీ వేరే హీరోతో చేయాలని అనుకున్నారట.
కానీ అనుకోని కారణాలవల్ల ఆ హీరో హ్యాండ్ ఇవ్వడంతో మహేష్ బాబు ను హీరోగా పెట్టి సినిమా చేశారు.ఇక మొత్తానికైతే ఈ సినిమా ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించింది.
ఇక ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందడంలో చాలా వరకు సక్సెస్ అయిందనే చెప్పాలి.అయితే ఈ సినిమాను వదిలేసుకున్న హీరో ఎవరు అంటే హీరో సుమంత్ అని తెలుస్తుంది.
ఇప్పటికే ఈయన చాలా సినిమాలను వదిలేసుకున్నాడు అందులో భాగంగానే ఈ సినిమాని కూడా రిజెక్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశారనేచెప్పాలి… నువ్వే కావాలి, తొలిప్రేమ, ఇడియట్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను వదిలేసుకున్న సుమంత్( Sumanth) మురారి సినిమాను కూడా వదిలేసుకున్నాడని తెలియడంతో ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.ఇక ఈ నాలుగు సినిమాలను కనుక చేసి ఉంటే సుమంత్ కెరీర్ అనేది ఇప్పటికి టాప్ రేంజ్ లో ఉండేదని పలువురు సినీ విమర్శకులు కూడా కామెంట్లు చేస్తున్నారు.ఇక ప్రస్తుతం సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి‘ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని అందుకోవాలనే లక్ష్యంతో ఆయన ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఈ సినిమాతో ఆయన సక్సెస్ అయితే మరోసారి ఆయన తన స్టార్ డమ్ భారీగా పెంచుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సుమంత్ అక్కినేని అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులను కూడా అలరిస్తాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది… ఆయన ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు దాటినప్పటికీ ఒకటి రెండు సినిమాలను మినహాయిస్తే ఇప్పటివరకు ఆయనకు సరైన సక్సెస్ అయితే లేదు…
.