బలహీనతకు ప్రధాన కారణాల్లో రక్తహీనత ( anemia )ఒకటి.ఇటీవల కాలంలో రక్తహీనత అనేది కోట్లాది మందిని పట్టిపీడిస్తోంది.
అయితే రక్తహీనత, బలహీనత రెండిటిని తరిమికొట్టే వండర్ ఫుల్ లడ్డూ ఒకటి ఉంది.దాని కోసం ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకుని అందులో అరకప్పు బెల్లం తురుము మరియు కొద్దిగా వాటర్ వేసి ఉడికించాలి.
బెల్లం పూర్తిగా మెల్ట్ అయ్యాక దించేయాలి.ఆ తర్వాత ఒక కప్పు పెసలును( Moong dall ) రంగు మారేంతవరకు వేయించుకుని.
మిక్సీ జార్ లో బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్లు నెయ్యి( ghee ) మరియు పావు కప్పు జీడిపప్పు పలుకులు( Cashew nuts ) వేసి వేయించుకోవాలి.
ఆపై అందులో గ్రైండ్ చేసుకున్న పెసర పొడిని వేసి పది నిమిషాల పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఈ పెసర పొడిలో కొంచెం కొంచెంగా బెల్లం సిరప్( Jaggery syrup ) చేసుకుంటూ కలుపుకుని లడ్డూల మాదిరి చుట్టుకోవాలి.
ఈ పెసర లడ్డూలను రోజుకొకటి చొప్పున తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.
ఈ పెసర లడ్డూలో ఐరన్, విటమిన్ బి9( Iron, vitamin B9 ) పుష్కలంగా ఉంటాయి.అందువల్ల నిత్యం ఈ లడ్డూను తింటే రక్తహీనత దూరం అవుతుంది.బలహీనత పరారవుతుంది.
శరీరం శక్తివంతంగా మారుతుంది.అలాగే ఈ పెసర లడ్డూలో మెండుగా ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియలో సహాయపడుతుంది.
ప్రేగు క్రమబద్ధతను ప్రోత్సహిస్తుంది.బరువు తగ్గాలనుకునే వారు ఈ లడ్డూను తింటే.
అందులోని ప్రోటీన్ మరియు ఫైబర్ కంటెంట్ అతి ఆకలిని అరికడతాయి.మీరు బరువు తగ్గే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తాయి.
అంతేకాదు, ఈ పెసర లడ్డూలో పొటాషియం మరియు మెగ్నీషియం ఉంటాయి.ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.అందువల్ల హైపర్ టెన్షన్‌తో బాధపడేవారు ఈ లడ్డూను రెగ్యులర్ గా తీసుకోండి.శరీరంలో కణజాలం ఏర్పడటానికి మరియు మరమ్మత్తుకు తోడ్పడే ప్రోటీన్ ను కూడా ఈ పెసర లడ్డూ ద్వారా పొందవచ్చు.