టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాష్ అండ్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో పూరి జగన్నాథ్ ( Puri Jagannath ) ఒకరు ఈయన సినిమా చేశారు అంటే సినిమాపై ఎన్నో అంచనాలు ఉంటాయి.అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్స్ గా కొనసాగుతున్న వారందరూ కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాలు చేసే సక్సెస్ అందుకున్న వారే అని చెప్పాలి.
ఇలా ఒకప్పుడు పూరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేవి కానీ ఇటీవల కాలంలో కాస్త సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నాయి.
ఇక ఈయన చివరిగా 2019వ సంవత్సరంలో రామ్ ( Ram ) హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ ( Ismart Shankar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే సక్సెస్ అందుకున్నారు.ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేసి డిజాస్టర్ నెత్తిన పెట్టుకున్నారు.ఇక ఈ సినిమా తర్వాత పూరి ఇండస్ట్రీకి దూరమవుతారని అందరూ భావించారు కానీ ఈయన తిరిగి బౌన్స్ అవుతూ డబుల్ ఇస్మార్ట్ ( Double Ismart ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
రామ్ పోతినేని కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ రాబోతున్న నేపథ్యంలో ఇటీవల వరంగల్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.ఇక ఈ కార్యక్రమంలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.ఈ సినిమా కోసం నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేశానని కామెంట్లు చేశారు.ఇదివరకు చిన్నచిన్న తప్పులతో తన సినిమాలు ఫెయిల్యూర్స్ అందుకున్నాయి.అయితే ఇది నాకు తెలిసిన పనే కదా అని నా తప్పులను నేనే సరి చేసుకుంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి సినిమా చేశానని ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.