నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు ( Akkineni Nageswara Rao )ఎలాంటి చెడు అలవాట్లు ఉండకపోయేవి.ఈ లెజెండరీ హీరో ఏడు శతాబ్దాలకు పైగా సినిమా ఇండస్ట్రీలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగారు.
ఆయన అందించిన విశేషమైన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ (2011), పద్మ భూషణ్ (1988), పద్మశ్రీ (1968)లతో సత్కరించింది.ఇంత గొప్ప స్థాయికి రావడానికి ప్రధాన కారణం ఏయన్నార్ స్మోకింగ్, డ్రింకింగ్ వంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ తన మొత్తం లైఫ్ సినిమాలకు డెడికేట్ చేయడమే అని చెప్పుకోవచ్చు.
సాధారణంగా మూవీ ఇండస్ట్రీలో డ్రింకింగ్ చాలా కామన్.పార్టీలకు వెళ్తే లిక్కర్ తాగించకుండా ఎవరినీ వదలరు.
కానీ కొందరు మాత్రం లిక్కర్ కి స్ట్రిక్ట్ గా “నో” చెప్తారు.కానీ కొన్ని సందర్భాల్లో ఎవరైనా సరే తాగక తప్పదు.
అక్కినేని నాగేశ్వరరావు కూడా ఒక విందుకు వెళ్లినప్పుడు మందు తాగాల్సి వచ్చింది.ఆ తర్వాత ఆయన నేరుగా ఇంటికి వెళ్లి పోయాడు.
అప్పటికే చాలా రాత్రి అయింది.ఇంటి తలుపు ముందు నిలబడి ఏయన్నార్ డోర్ బెల్ కొట్టారు.
ఆయన సతీమణి అన్నపూర్ణ తలుపు తీయగానే నాగేశ్వరరావు నోటి నుంచి ఒక్కసారిగా మందు వాసన వచ్చింది.
దాంతో అన్నపూర్ణ( Annapurna ) చాలా ఆశ్చర్యపోయారు.“ఏంటీ వాసనా? తాగి వచ్చారా? అని అడిగారు.“అబ్బే, అదేం లేదే.అక్కడ పార్టీకి వెళ్తే కూరల్లో విస్కీ లాంటిది కలిపినట్లు ఉన్నారు.అందుకే ఈ వాసన” అని చెబుతూ నాగేశ్వరరావు సరాసరి తన బెడ్ రూమ్ లోకి వెళ్లి పడుకున్నారు.
మరుసటి రోజు ఉదయం లేవగానే అక్కినేనికి రెండు గ్లాసుల మజ్జిగ ఇచ్చారు.మత్తు వదిలిన తర్వాత అతనితో మాట్లాడుతూ “మీరు నిన్న రెండు తప్పులు చేశారు.ఒకటి మద్యం తాగడం.మరొకటి తాగలేదని అబద్ధం చెప్పడం.” అని సున్నితంగా మందలించారు అన్నపూర్ణ.అప్పటినుంచి ఏఎన్నార్ మందు జోలికి వెళ్లడమే మానేశారు.
అయితే హార్ట్ ఆపరేషన్ సర్జరీ జరిగిన తర్వాత డాక్టర్ల సలహా మేరకు రెండు పెగ్గుల బ్రాందీ మాత్రం తాగేవారు.ఏది ఏమైనా అన్నపూర్ణ అక్కినేనిని బాగా అర్థం చేసుకునేవారు.
అలాంటి అర్థాంగి దొరకడం వల్లే అక్కినేని దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగింది.ఎలాంటి పరిస్థితిని అయినా ఆమె చాలా చక్కగా డీల్ చేస్తూ మారీడ్ లైఫ్‌ను హ్యాపీగా లీడ్ చేశారు.
అక్కినేనికి అన్నపూర్ణ అంటే చాలా ఇష్టం.అందుకే ఆమె పేరిట హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ఒక పెద్ద స్టూడియో కూడా కట్టించారు.