బ‌రువు త‌గ్గాలా..? అయితే గుమ్మ‌డి పండును ఇలా తీసుకోండి!

బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారా.? అందుకోసం ఎన్నెన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా.? ఖ‌ఠిన‌మైన డైట్స్ ను పాటిస్తున్నారా.

? అయితే మీలాంటి వారికి గుమ్మ‌డి పండు ఒక వ‌ర‌మనే చెప్పాలి.తినేందుకు రుచిగా ఉండ‌ట‌మే కాదు.

గుమ్మ‌డి పండులో విటమిన్‌ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, ఫాస్ఫరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, ఫొలేట్‌, నియాసిన్‌, థయామిన్‌, కెరోటిన్‌, ప్రోటీన్‌, ఫైబ‌ర్‌, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోష‌కాలు మెండు ఉంటాయి.అందుకే ఆరోగ్య ప‌రంగా ఇది అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంది.

ముఖ్యంగా అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు ఇప్పుడు చెప్పబోయే విధంగా గుమ్మ‌డి పండును తీసుకుంటే.సూప‌ర్ ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవ్వొచ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం గుమ్మ‌డి పండును ఎలా తీసుకుంటే బ‌రువు త‌గ్గుతారో చూసేయండి.

ముందుగా ఒక చిన్న సైజ్ గుమ్మ‌డి పండును తీసుకుని పై తొక్క‌, లోప‌ల ఉన్న గింజ‌లు తొల‌గించి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

Advertisement

ఈ ముక్క‌ల‌ను నీటిలో శుభ్రంగా క‌డిగి పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో చిన్న అల్లం ముక్క‌, ఒక ల‌వంగం, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ ర‌సం, క‌డిగి పెట్టుకున్న గుమ్మ‌డి పండు ముక్క‌లు, హాఫ్ లీట‌ర్ వాట‌ర్ పోసి మెత్త‌గా గ్రైండ్ చేసుకుంటే సూప‌ర్ టేస్టీ గుమ్మ‌డి జ్యూస్ సిద్ధం అవుతుంది.ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ స‌మ‌యంలో ఈ జ్యూస్ ను తీసుకుంటే.

శ‌రీరంలో కొవ్వు వేగంగా క‌రుగుతుంది.అతి ఆక‌లి స‌మ‌స్య దూరం అవుతుంది.

దాంతో వేగంగా వెయిల్ లాస్ అవుతారు.అంతే కాదండోయ్‌.

ఈ గుమ్మ‌డి జ్యూస్‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.మోకాళ్ల నొప్పులు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఎముక‌లు, కండ‌రాలు బ‌లంగా మార‌తాయి.కంటి చూపు పెరుగుతుంది.

Advertisement

రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ స్ట్రోంగ్‌గా మారుతుంది.మ‌రియు చ‌ర్మం కూడా ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా మెరుస్తుంది.

తాజా వార్తలు