చిన్నతనంలో నేర్చుకున్న పనులే ఈ సెలబ్రిటీలకు ప్లస్ అయ్యాయి..?

సాధారణంగా మనం చిన్నతనంలో ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటాం.స్కిల్ అనే కాదు, ఒక ఇంటెన్స్ ప్యాషన్‌తో కొన్ని పనులను సాధన చేస్తాం.

 Celebs Habits Impact On Movies , Ritika Singh, Ram Charan ,anushka Shetty , T-TeluguStop.com

అయితే కొన్నిసార్లు అవే మనకు అడల్ట్ లైఫ్‌లో చాలా ఉపయోగపడతాయి.సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా తమ చైల్డ్‌హుడ్, టీనేజ్ డేస్‌లో రకరకాలుగా పనులు నేర్చుకుంటారు.

అలా నేర్చుకున్న పనులే కొంతమంది సినీ సెలబ్రిటీలకు చాలా ప్లస్ అయ్యాయి.మరి వాళ్లు ఎవరో, వాళ్లు నేర్చుకున్న ఆ వర్క్స్ ఏంటో తెలుసుకుందామా.

రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌( Ram Charan )కు చిన్నప్పటి నుంచి గుర్రాలంటే చాలా ఇష్టం.అందుకే చాలా చిన్న వయసు నుంచి హార్స్ రైడింగ్ చేయడం మొదలు పెట్టాడు.

గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు చెన్నైలో స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.ఈ సంగతి చెర్రీ సెకండ్ మూవీ చేసేదాకా ఎవరికీ తెలియదు.

అందుకే దర్శకధీరుడు రాజమౌళి మగధీరలో రామ్ చరణ్‌ గుర్రపు స్వారీ చేయాల్సి ఉంటుందని, ట్రైనింగ్ తీసుకోవాలని చిరంజీవికి చెప్పారట.అయితే రామ్ చరణ్ అప్పటికే గుర్రపు స్వారీలో ఎక్స్‌పర్ట్ అని తెలుసుకుని రాజమౌళి ఆశ్చర్యపోయారట! హార్స్ రైడింగ్ నేర్చుకోవడం వల్ల చరణ్‌కు చాలా ప్లస్ అయింది.

నేర్చుకోకపోయి ఉంటే మగధీర కోసం కష్టపడాల్సి వచ్చేది.చెర్రీ ఇతర సినిమాల్లో కూడా హార్స్ రైడింగ్ స్టంట్స్‌ చేయాల్సి వచ్చింది.

ఆల్రెడీ ప్రొఫెషనల్ హార్స్ రైడర్ కాబట్టి ఆ స్టంట్స్‌ తానే ఈజీగా పూర్తిగా చేశాడు.చరణ్‌ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్‌ను సైతం కొనుగోలు చేశాడు.

గుర్రపు స్వారీ చేసేందుకు నెలకు ఒకట్రెండు సార్లు వికారాబాద్‌లోని తన స్నేహితుడి శాలకు కూడా వెళ్తుంటాడు.చెర్రీకి 25 ప్రత్యేక గుర్రాలు ఉన్నాయని సమాచారం.

అనుష్క శెట్టి

Telugu Anushka Shetty, Guru, Magadheera, Martial, Ram Charan, Ritika Singh, Toll

హీరోయిన్ అనుష్క( Anushka Shetty ) శెట్టి భరత్ ఠాకూర్ వద్ద యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసింది.యోగా సాధన తన జీవితాన్ని మార్చేసిందని ఈ ముద్దుగుమ్మ చెబుతుంది.అనుష్క శెట్టి సినిమా సెట్స్‌లో తన సహనటులకు కూడా యోగాలో శిక్షణ ఇస్తుంది. గతంలో అనుష్క ముంబైలో యోగా సాధన చేసింది.తర్వాత యోగా టీచర్‌గా మారింది.యోగా నేర్చుకోవడం వల్ల జీవితంలో ఆమె చాలా ప్రయోజనాలు పొందింది.

ఈ తార ఫిట్, హెల్తీగా ఉండగలిగింది.అంతేకాదు కొన్ని సినిమా పాటల్లో కూడా యోగా స్కిల్స్ ఉపయోగించుకుంది.

రితికా సింగ్

Telugu Anushka Shetty, Guru, Magadheera, Martial, Ram Charan, Ritika Singh, Toll

రితికా సింగ్ ( Ritika Singh )చిన్నతనం నుంచి తన తండ్రి మార్గదర్శకత్వంలో కిక్‌బాక్సింగ్ నేర్చుకుంది.అంతేకాదు మిక్స్‌డ్ మార్షల్ ఆర్టిస్ట్‌గానూ శిక్షణ పొందింది.ఈ స్కిల్ వల్ల ఆమెకు సుధా కొంగర స్పోర్ట్స్‌ డ్రామా ఫిల్మ్ “గురు“లో మెయిన్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది.ఆ సినిమా ఆమె కెరీర్ కు ఎంతో సహాయపడింది.

ఇదే మూవీ తమిళంలో హిందీలో కూడా వచ్చింది వాటిలో కూడా ఆమే నటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube