ఈ సినిమాలకు హీరోలే పేర్లు పెట్టారు.. అవేంటంటే..?

సాధారణంగా సినిమాలకు డైరెక్టర్లు పేర్లు పెడతారు.సినిమాలకు హీరోలే పేరు పెట్టారు.

 Celebs Who Named Their Movie ,gabbar Singh , Harish Shankar, Mirapakay, Mr Ba-TeluguStop.com

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా మూడు చిత్రాలకు టైటిల్స్ ను హీరోలు నిర్ణయించారు.ఆ సినిమాలు, ఆ హీరోలు ఎవరో తెలుసుకుందాం.

మిరపకాయ్‌

Telugu Gabbar Singh, Harish Shankar, Krish, Mirapakay, Bachchan, Ravi Teja, Toll

2011లో విడుదలైన యాక్షన్ కామెడీ చిత్రం “మిరపకాయ్( Mirapakay)” సూపర్ హిట్ అయింది.ఈ మూవీ 113 సెంటర్లలో 50 రోజుల ఆడింది.హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేథ్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు.ఎస్.థమన్ సంగీతం అందించారు.అయితే మొదటగా ఈ సినిమాకి “రొమాంటిక్ క్రిష్/రొమాంటిక్ రిషి” అనే టైటిల్ పెట్టాలని మేకర్స్ భావించారు.

కానీ ఆ పేరు రవితేజకు నచ్చలేదు.దీనికి “మిరపకాయ్‌” అనే టైటిల్ పెడితే బాగుంటుందని చెప్పాడు.మేకర్స్‌కి కూడా అది నచ్చడంతో ఆ పేరుతోనే ఈ సినిమా వచ్చింది.

గబ్బర్ సింగ్

యాక్షన్ కామెడీ చిత్రం గబ్బర్ సింగ్ (2012)( Gabbar Singh ) పవన్ కళ్యాణ్ కెరీర్‌లో చెప్పుకోదగిన సినిమాగా నిలుస్తుంది.రూ.30 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ రూ.110 వసూలు చేసి ఇంతకుముందు ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసింది.2011 నాటికి టాలీవుడ్ ఇండస్ట్రీలో హైయ్యెస్ట్ ఫస్ట్ డే, హైయ్యెస్ట్ ఫస్ట్ వీక్, హైయ్యెస్ట్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా అది ఆ రికార్డులు బద్దలు కొట్టింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించారు.

ఇది హిందీ చిత్రం దబాంగ్ (2010)కి రీమేక్.తెలుగు రీమేక్‌లో స్క్రీన్‌ప్లే చాలా మార్చేశారు.కేరెక్టరేజేషన్ కూడా చేంజ్ చేశారు.

అయితే ఈ సినిమాకి ఏం పేరు పెడదామా అని ఆలోచిస్తున్నప్పుడు “గబ్బర్ సింగ్” అని పవన్ కళ్యాణ్ సూచించాడు.చిన్నప్పుడు పవన్ గబ్బర్ సింగ్ అనే ఒక మాస్ పోలీస్‌ను చూశాడు.

అందుకే అదే పేరు పెడదామంటే మేకర్స్ ఒప్పుకున్నారు.ఆ పేరే ఈ మూవీకి ఒక రకంగా ప్లస్ ప్రెస్ అయ్యింది.

మిస్టర్ బచ్చన్

Telugu Gabbar Singh, Harish Shankar, Krish, Mirapakay, Bachchan, Ravi Teja, Toll

హీరో రవితేజకి అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం.అందుకే తన నెక్స్ట్ మూవీకి “మిస్టర్ బచ్చన్( Mr Bachchan) ” అనే పేరు పెట్టుకున్నాడు.ఈ మూవీలో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే( Bhagyashri Borse) హీరో హీరోయిన్లుగా నటించారు.దీనిని కూడా హరీష్ శంకర్ డైరెక్ట్ చేశాడు.దీన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆగస్టు 15న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube