ఇలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి ( Vijay Sethupathi ) ఒకరు.ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకొని కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
ఇకపోతే ఇటీవల మహారాజా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు విజయ్ సేతుపతి ఒక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.గతంలో తాను ఇబ్బందులు పడుతున్న సమయంలో పదేపదే మహేష్ బాబు ( Mahesh Babu ) సినిమా చూశానని వెల్లడించారు.ఇలా కష్టాలలో ఉన్న సమయంలో నేను మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు సినిమాని( Athadu Movie ) పదేపదే చూసే వాడినని వెల్లడించారు.
ఈ సినిమాలో మహేష్ బాబు ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు ప్రతి ఒక్క సన్నివేశం నాకు గుర్తుందని తెలిపారు.త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) ఈ సినిమాలోని భావోద్వేగాలను చాలా అద్భుతంగా చూపించారు.త్రిష మహేష్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ అద్భుతంగా ఉందని, అలాగే బ్రహ్మానందం డైలాగ్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయని ఈయన మహేష్ బాబు అతడు సినిమా గురించి చేస్తున్న ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమా 2005వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇలా తాను కష్టాలలో ఉన్నప్పుడు మహేష్ సినిమా చూశానని విజయ్ సేతుపతి చెప్పడంతో మహేష్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.