అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరపున అభ్యర్ధిగా ఖరారైన భారత సంతతి నేత, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్( Kamala Harris ) తన రన్నింగ్‌మెట్ (ఉపాధ్యక్ష అభ్యర్ధిగా)గా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్( Tim Walz )ను ఎంపిక చేశారు.ఈ నేపథ్యంలో గతంలో శ్వేతజాతి పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురై ప్రాణాలు కోల్పోయిన నల్లజాతికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ (George Floyd )కేసు మరోసారి తెరపైకి వస్తోంది.
ట్రంప్ బృందం .కమలా హారిస్ – వాల్జ్‌లను ఇదే అంశంపై టార్గెట్ చేస్తోంది.2020 మేలో జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత చెలరేగిన అల్లర్లను నియంత్రించడంలో గవర్నర్‌గా వాల్జ్ విఫలమయ్యారని వారు మండిపడుతున్నారు.మిన్నియాపోలిస్ వీధుల్లో నిరసనలకు , అల్లర్లకు ఆయన అనుమతించాడంటూ రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధి, ఒహియో సెనేటర్ జేడీ వాన్స్ దుయ్యబట్టారు.
జార్జ్ ఫ్లాయిడ్ హత్య సమయంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు.
ఈ క్రమంలో జార్జ్‌ఫ్లాయిడ్ తమ్ముడు ఫిలోనిస్ ఫ్లాయిడ్( Philonise Floyd ) .డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఎంపికైన టిమ్ వాల్జ్‌కు మద్ధతు పలికారు.2021లో మిన్నెసోటా పోలీసులు కాల్చిచంపిన డాంట్ రైట్ అనే నల్లజాతీయుడి అంత్యక్రియలకు వాల్జ్ హాజరై ఐక్యత అంటే ఏంటో చూపించారని ఫిలోనిస్ పేర్కొన్నారు.అంత్యక్రియల కోసం వాల్జ్ తన సమయాన్ని వెచ్చించారని, అతనికి మంచి మనసుందని ఫ్లాయిడ్ ప్రశంసించారు.
ఇన్నేళ్లుగా టిమ్ వాల్జ్ నాయకత్వం తనను ఆకట్టుకుందని, జార్జ్ మరణంలో ప్రాసిక్యూషన్‌కు నాయకత్వం వహించడానికి స్టేట్ అటార్నీ జనరల్ కీత్ ఎల్లిసన్‌ను నియమించాలని వాల్జ్ నిర్ణయం తీసుకున్నారని ఫ్లాయిడ్ గుర్తుచేసుకున్నారు.కమలా హారిస్‌కు రన్నింగ్‌మెట్‌గా వాల్జ్ ఎంపికయ్యారని తెలుసుకుని తాను ఎంతో సంతోషించానని.ఆయన గురించి తానేమీ చెడుగా చెప్పనని, వాల్జ్‌తో కరచాలనం చేయాలనుకుంటున్నట్లు ఫిలోనిస్ అన్నారు.
ఎన్నికల నేపథ్యంలో ప్రచారంతో పాటు ఆయనకు చేతనైన సాయం చేయడానికి సిద్ధమని ఫ్లాయిడ్ ప్రకటించారు.మిన్నెసోటా(Minnesota ) రాష్ట్రంలోని మిన్నియాపోలిస్ నగరంలో జార్జ్ ఫ్లాయిడ్ (46)ను పోలీసులు అరెస్టు చేస్తుండగా చనిపోయిన సంగతి తెలిసిందే.2020 మే 25న జరిగిన ఈ ఘటన కారణంగా అమెరికాలోని అనేక నగరాలు రగిలిపోయాయి.ఫ్లాయిడ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మెడపై గట్టిగా నొక్కిపట్టడంతో అతను ఊపిరాడక మరణించాడు.
తనకు ఊపిరాడటం లేదని ఫ్లాయిడ్ అరుస్తున్నా పట్టించుకోకుండా పోలీసులు క్రూరంగా వ్యవహరించినట్లు వైరల్ అయిన వీడియోలలో ఉంది.ఫ్లాయిడ్ ఆక్సిజన్ అందకే మరణించాడని వైద్యుడు తెలిపారు.వివాదాస్పద పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్ మోకాలు అతని మెడపై ఉండటం వల్ల అతను ఊపిరి ఆడక ప్రాణాలు వదిలాడని డాక్టర్ వాంగ్మూలం ఇచ్చారు.దీంతో చౌవిన్‌కు 22.5 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.