తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు.అయినప్పటికీ అందులో తమదైన రీతిలో మంచి పేరు సంపాదించుకొని వరుస సక్సెస్ లు అందుకున్న వాళ్లు కొందరు మాత్రమే ఉన్నారు.
ఇక ఇప్పటివరకు ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లను అందుకున్న డైరెక్టర్లలో రాజమౌళి( Rajamouli ) మొదటి స్థానంలో ఉంటే, ఆయన తర్వాత స్థానంలో అనిల్ రావిపూడి ఉన్నారు.దాదాపు వీళ్ళిద్దరూ 100% స్ట్రైక్ రేట్ తో ఉన్నారు.
ఇక వరుసగా వచ్చిన సినిమాలు వచ్చినట్టుగా సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.
ఇక అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కమర్షియల్ సినిమాలను చేస్తుంటే రాజమౌళి మాత్రం భారీ రేంజ్ లో సినిమాలను చేస్తూ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్స్ ని సృష్టిస్తున్నాడు.ఇక ఇప్పటికే ఆయన బాహుబలి త్రిబుల్ ఆర్ సినిమాలతో తన సత్తా చాటుకొని ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని విస్తరింప చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు.ఇక అందులో భాగంగానే ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన వెంకటేష్( Venkatesh ) తో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే…
ఇక ఇదిలా ఉంటే ఈ ఇద్దరిని మినహాయిస్తే మిగిలిన దర్శకులు అందరూ చేస్తున్న సినిమాలు సక్సెస్ అవుతున్నప్పటికీ మధ్యల కొన్ని ప్లాప్ లు కూడా వస్తున్నాయి.అందువల్లే వీళ్ళిద్దరికి మాత్రమే ఎక్కువ సక్సెస్ లు దక్కయనే ఉద్దేశంతో వీళ్ళిద్దరిని స్టార్ డైరెక్టర్లు గా గుర్తించటమే కాకుండా ఫెయిల్యూర్ అనేది ఎరుగని దర్శకులుగా గుర్తించడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… అనిల్ రావిపూడి ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఎఫ్ 3 సినిమా కొంచెం అటు ఇటుగా అనిపించినప్పటికీ ఆ సినిమా మాత్రం కమర్షియల్ గా సక్సెస్ అయిందనే చెప్పాలి…
.